Cinema: ఏం సినిమా రా బాబూ.. ఛావా రికార్డునే బద్దలుకొట్టిన 3 కోట్ల మూవీ.. బాక్సాఫీస్ షేక్..
ఈ ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన చిత్రాలు చాలానే ఉన్నాయి. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, తమిళం భాషలలో వచ్చిన చిత్రాలు థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్నాయి. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఓ హారర్ కామెడీ ఇప్పుడు ఏకంగా ఛావా మూవీ రికార్డ్ బద్దలుకొట్టింది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ?

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఓ చిన్న సినిమా దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ సినిమా ఇప్పుడు ఘన విజయం సాధించింది. అంతేకాదు.. ఇటీవల అత్యధిక వసూళ్లతో రికార్డ్ సృష్టించిన విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఛావా సినిమాను వెనక్కు నెట్టింది. ఇంతకీ ఇప్పుడు మేం చెబుతున్న సినిమా పేరెంటో తెలుసా.. ? అదే జగదీష్ మిశ్రా దర్శకత్వంలో వచ్చిన హర్రర్-కామెడీ చిత్రం ‘బౌ బుట్టు భూటా’. ఇది ఒడియా సినిమా. కానీ థియేటర్లలో సంచలన విజయాన్ని సాధించింది. రాజ పర్వ పవిత్ర సందర్భంగా జూన్ 12న రిలీజ్ అయిన ఈ సినిమాలో బాబూషాన్ మొహంతి, అర్చిత సాహు , అపరాజిత మొహంతి ప్రధాన పాత్రలు పోషించారు.
కేవలం రూ.3 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు 400% కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఇది గతంలో 373.37% ROIని కలిగి ఉన్న ఛావా సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఒడియా సంస్కృతి, జానపద కథలలో లోతుగా పాతుకుపోయిన భయానక , కామెడీల మిశ్రమమే ఈ సినిమా విజయానికి కారణమని చెప్పొచ్చు. ప్రతీకార స్పూర్తి ఉన్న ఓ చేపల రైతు బుట్టు కథతో సాగుతుంది. స్థానికంగా ఉండే సంప్రదాయలు, నమ్మకాలను కలుపుకుని సాగిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది.
ప్రణబ్ ప్రసన్న రథ్ రాసిన డైలాగ్స్, మహ్మద్ ఇమ్రాన్ స్క్రీన్ ప్లే, వాటి వాస్తవిక, సాంస్కృతికపై ప్రశంసలు కురిపించారు. జూన్ 12న విడుదలైన ఈ సినిమా రూ.15.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఛావా చిత్రం రికార్డ్ బ్రేక్ చేసింది. రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘చావా’ రూ.615.39 కోట్లు సంపాదించింది. రూ.6 కోట్లతో నిర్మించిన మలయాళ చిత్రం ‘రేఖచిత్రం’ రూ.27 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పుడు IMDbలో 8.4 రేటింగ్‌ను పొందింది.
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..








