K3 Kotikokkadu: గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయిన కిచ్చా సుదీప్ ‘కే3 కోటికొక్కడు’
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా శివ కార్తిక్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3: కోటికొక్కడు’. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం

Kicha Sudeep
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kicha Sudeep) హీరోగా శివ కార్తిక్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3: కోటికొక్కడు’. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది. సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు కూడా భారీ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిన ఈ చిత్రంపై తెలుగులో మంచి అంచనాలు వుండటంతో సరైన డేట్ కోసం వేచి చూసిన నిర్మాతలు.. తాజాగా జూన్ 17న చిత్రాన్ని గ్రాండ్ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఇప్పటికే విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలాగే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్ లో బాగంగా మరో మూడు పాటలని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మూవీ ప్రమోషన్స్ ని కూడా స్పెషల్ ప్లాన్స్ చేస్తున్నారు నిర్మాతలు. హీరో కిచ్చా సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిందని, తెలుగులోనూ ‘కే3 కోటికొక్కడు’ మంచి విజయం సాధిస్తుందని వెల్లడించారు నిర్మాతలు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Bhanu Chander: రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీనియర్ హీరో.. ఆ సినిమా డబ్బింగ్ చెబుతున్నప్పుడే అర్థమైందంటూ..
Nayanthara Vignesh: నయన్, విఘ్నేష్ పెళ్లి కార్డు రెడీ ?.. సోషల్ మీడియాలో వైరలవుతున్న పెళ్లి పత్రిక..
Singeetam Srinivasa rao: లెజండరీ డైరెక్టర్ ఇంట విషాదం.. సింగీతం శ్రీనివాస రావుకు సతీ వియోగం..
ఇవి కూడా చదవండి
Follow Us



