Bhanu Chander: రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీనియర్ హీరో.. ఆ సినిమా డబ్బింగ్ చెబుతున్నప్పుడే అర్థమైందంటూ..
తాను ముంబైలో ఉన్న రోజుల్లో నైట్ క్లబ్స్ లో మ్యూజిషియన్ గా పనిచేసానని.. ఆ సమయంలోనే తనకు డ్రగ్స్ అలవాటయ్యాయని..
డైరెక్టర్ రాజమౌళిపై (Rajamouli) సీనియర్ హీరో భాను చందర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఓ సినిమాను ప్రమోట్ చేయడంలో రాజమౌళి కింగ్ అన్నారు. నిరీక్షణ, ముక్కుపుడక, కొంటె కోడలు వంటి చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో కీలకపాత్రలలో నటించి మెప్పించారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే డైరెక్టర్ రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ముంబైలో ఉన్న రోజుల్లో నైట్ క్లబ్స్ లో మ్యూజిషియన్ గా పనిచేసానని.. ఆ సమయంలోనే తనకు డ్రగ్స్ అలవాటయ్యాయని.. కానీ వాటి నుంచి మార్షల్ ఆర్ట్స్ వల్లే దూరమయ్యానని తెలిపారు. మనిషికి మానసిక, శారీరక వికాసానికి మార్షన్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయన్నారు..
అలాగే.. నేను నటుడు కావాలని మా అమ్మ ఎన్నో కలలు కంది.. అలా నేను ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి శిక్షణ తీసుకున్నాను.. రజనీకాంత్ మాకు సీనియర్, ఆనాటి నటీనటులందరికీ ఆయనే స్పూర్తి.. చిరంజీవి నా జూనియర్. మేమిద్దరం ఆ రోజుల్లో రూమ్ షేర్ చేసుకున్నాం. నాకు బైక్ నడపడం నేర్పింది కూడా చిరునే అంటూ చెప్పుకొచ్చారు.. ఇక రాజమౌళి గురించి ప్రస్తావిస్తూ.. సింహాద్రి సినిమా డబ్బింగ్ చెబుతున్నప్పుడే నాకు అర్థమైంది.. ఆ సినిమా సూపర్ హిట్ అని.. అదే విషయాన్ని రాజమౌళితోనూ చెప్పాను.. నువ్వు తప్పకుండా సెన్సేషనల్ డైరెక్టర్ అవుతావు అన్నాను. ఇప్పుడు దేశంలోనే గొప్ప దర్శకుడిగా మారారు. సినిమాను ప్రమోట్ చేయడంలో రాజమౌళి కింగ్. ఏ సినిమాను ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లాలి అనేది బాగా తెలుసు. సినిమా మార్కెటింగ్ విషయంలో ఇక్కడే కాదు.. ఉత్తరాదిలోనూ రాజమౌళిని తలదన్నేవారు లేరు.. ఆయన నుంచి టెక్నిక్స్ అందరూ నేర్చుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు..