AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayan-Vignesh: నయన్-విఘ్నేష్‌ల మ్యారేజ్ డేట్ ఫిక్స్..! పెళ్లి ఎక్కడో తెల్సా..?

స్టార్ నటి నయనతార, దర్శకుడు విష్నేుశ్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు సిద్దమైనట్లు తెలుస్తోంది.

Nayan-Vignesh: నయన్-విఘ్నేష్‌ల మ్యారేజ్ డేట్ ఫిక్స్..!  పెళ్లి ఎక్కడో తెల్సా..?
Nayan Vignesh Wedding
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 08, 2022 | 12:04 PM

Share

Actress nayanthara: సౌత్‌లో మరో స్టార్ కపుల్‌ పెళ్లిపీటలెక్కబోతోంది. లేడీ సూపర్‌స్టార్ నయనతార… కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ ఒక్కటవ్వబోతున్నారు. ఆరేడు సంవత్సరాలుగా వీళ్లిద్దరి లవ్వాయణం నడుస్తూనే ఉన్నా… రీసెంట్‌గా పెళ్లి వార్తల్లో కనిపిస్తోంది ఈ క్రేజీ జంట. ఇప్పుడు… లెటజ్ సేవ్‌ ది డేట్ అంటూ పెళ్లి తేదీ కూడా అనౌన్స్ చేసినట్టు తెలుస్తోంది. కల్యాణ ఘడియలు కన్‌ఫమ్ అయ్యాయి సరే… ఇంతకీ వెన్యూ ఎక్కడ అంటే.. దాని మీద కూడా ఓ క్లారిటీ ఉందిక్కడ. జూన్… 9, జస్ట్ టెన్‌ డేస్ టు గో… అంటున్నారు నయన్ అండ్ విఘ్నేష్. జూన్‌9న పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ వాళ్ల పేర్ల మీద కలర్‌ఫుల్‌ ప్రకటనొకటి చక్కర్లు కొడుతోంది. కానీ.. పెళ్లి ఎక్కడన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. రెండు వారాల కిందటే తిరుమల(Tirunmala) వచ్చి శ్రీవారిని దర్శించుకున్న నయనతార… తమ పెళ్లి కూడా ఇక్కడే చేసుకోబోతున్నట్టు హింట్ ఇచ్చారు. కొండ మీద కల్యాణమండపం కూడా రిజర్వ్ చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. కానీ… కొన్ని అనివార్య కారణాల వల్ల… వీళ్ల పెళ్లి వేదిక మహాబలిపురానికి(Mahabalipuram) మారినట్టు తెలుస్తోంది. వారి వెడ్డింగ్ కార్డ్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.  వీరి వివాహం జూన్ 9న మహాబలిపురంలోని మహబ్ హోటల్ లో జరగనున్నట్లు తెలుస్తోంది.

పెళ్లికి ముందే అచ్చమైన దంపతుల్లా వీళ్లిద్దరూ రిపీటెడ్‌గా గుళ్లు గోపురాలూ తిరిగారు. అదే సీక్వెన్స్‌లో రిసెంట్‌గా మహాబలిపురం వెళ్లి… అక్కడొక రెస్టారెంట్‌లో చిలకా గోరింకల్లా కనిపించారు. నయన్‌కి గోరు ముద్దలు తినిపిస్తున్నప్పటి వీడియో పోస్ట్ చేశారు ఫియాన్సీ విఘ్నేశ్ శివన్. సో… మహాబలిపురంలోని ఒక రిసార్ట్‌లో జూన్‌9న పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు నయన్ అండ్ విఘ్నేశ్‌. ఇప్పటికే ఇద్దరూ నిర్మాతలుగా మారి ఒకే బేనర్ మీద సినిమాలు కూడా తీస్తున్నారు. రిసెంట్‌గా విఘ్నేశ్ డైరెక్ట్ చేసిన కణ్మణి రాంబో కతీజా మూవీలో మెయిన్ ఫిమేల్ లీడ్‌లో నటించారు నయనతార.

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై