Nayanthara Vignesh: నయన్, విఘ్నేష్ పెళ్లి కార్డు రెడీ ?.. సోషల్ మీడియాలో వైరలవుతున్న పెళ్లి పత్రిక..
ఇప్పటికే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించారని.. అందులో భాగంగానే తంజావూరులోని తమ కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా సమాచారం.
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కొద్దిరోజుల్లోనే తిరుపతి వివాహం చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించారని.. అందులో భాగంగానే తంజావూరులోని తమ కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా సమాచారం. వచ్చే నెల 9న వీరిద్దరి వివాహం తిరుమల సన్నిదిలో జరగబోతుందంటూ ప్రచారం నడించింది.. కానీ అనుహ్యంగా వారి వివాహ వేదిక మారినట్లుగా తెలుస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగనుందని టాక్. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల కేవలం కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగనుందని.. ఇప్పటికే అతిథులను ఆహ్వానించడం కూడా ప్రారంభించారట..
అయితే కొద్ది మంది అతిథులను డిజిటల్ ఇన్విటేషన్ వీడియో కూడా పంపిచారట. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన డిజిటల్ ఇన్విటేషన్ కార్డు వీడియో ఇదేనంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ 9న మహాబలిపురంలోని మహబ్ హోటల్లో వీరి పెళ్లి జరగనున్నట్లుగా ఉంది.. ఆ తర్వాత ఇండస్ట్రీలో స్నేహితుల కోసం చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్ జరిగే అవకాశముందని సమాచారం. విఘ్నేష్, నయన్.. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. తమ మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఇప్పటికే వీరిద్దరూ సోషల్ మీడియాలో తమ ఫోటోలను పంచుకున్నారు. అంతేకాకుండా.. ఇటీవల ఓ షోలో పాల్గోన్న నయన్ తన వేలి ఉంగరాన్ని చూపిస్తూ.. తనకు చాలా ప్రత్యేకమంటూ చెప్పడంతో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిపోయిందని టాక్ నడిచింది. ఇక ఇదే విషయాన్ని విఘ్నేష్ సైతం ఓ సినిమా ప్రమోషన్లో బయటపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విఘ్నేష్, నయన్ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.