AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya : జ్యోతిక తర్వాత నా ఫేవరేట్ హీరోయిన్ ఆమెనే.. అద్భుతమైన హీరోయిన్.. హీరో సూర్య..

కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ, నటనలో వైవిధ్యం చూపిస్తూ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సమానమైన స్టార్‌డమ్ , ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఏకైక పరభాషా నటుడు సూర్య. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ, వర్సటైల్ యాక్టర్‌గా నటుడిగా తనను తాను నిరంతరం నిరూపించుకుంటున్నారు.

Rajitha Chanti
|

Updated on: May 31, 2026 | 1:27 PM

Share
తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా టాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న కాంబినేషన్లలో హీరో సూర్య, నటి అసిన్ కాంబో ఒకటి. ముఖ్యంగా గజినీ (Ghajini) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ, నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగాఓ ఇంటర్వ్యూలో నటి అసిన్ గురించి హీరో సూర్య మాట్లాడిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 / 5
ఈ ఇంటర్వ్యూలో సూర్య తన ఫేవరెట్ కో-స్టార్స్ గురించి ప్రస్తావిస్తూ, తన భార్య జ్యోతిక తర్వాత తనకు నచ్చిన బెస్ట్ యాక్ట్రెస్ అసిన్ అని స్పష్టం చేశారు. అసిన్ ఎంతో ప్రొఫెషనల్ ,అద్భుతమైన నటి మాత్రమే కాదు, మంచి డాన్సర్ కూడా అని కొనియాడారు. స్క్రీన్ పై ఆమె ప్రెజెన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, మేకప్‌కు ముందు.. మేకప్ తర్వాత ఆమె లుక్స్, హావభావాలు పూర్తిగా మారిపోతాయని సూర్య నవ్వుతూ పంచుకున్నారు.

2 / 5
విభిన్న భాషలను చాలా త్వరగా నేర్చుకోవడంలో అసిన్ ది బెస్ట్ అని సూర్య ప్రశంసించారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఒక అగ్ర స్థానానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా టాలెంట్ ఉండాలని, అసిన్ లో ఆ ప్రతిభ పుష్కలంగా ఉందని అన్నారు. బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో కలిసి 'గజినీ' హిందీ రీమేక్‌లో నటించడం, అక్కడ కూడా అంతే కాన్ఫిడెంట్‌గా మెప్పించడం ఆమె కమిట్‌మెంట్‌కు నిదర్శనమని సూర్య పేర్కొన్నారు. ఆ నమ్మకమే ఆమెను అంతటి స్థాయికి తీసుకెళ్లిందని, కెరీర్‌లో ఆమె ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందంటూ ఆకాంక్షించారు.

3 / 5
అదే ఇంటర్వ్యూలో మరో నటి తమన్నా గురించి కూడా సూర్య చిన్న వ్యాఖ్య చేశారు. తమన్నా కూడా చాలా చిన్న వయసులోనే భాషలను సులువుగా నేర్చుకుంటూ మంచి నటిగా రాణిస్తోందని మెచ్చుకున్నారు. మొత్తానికి, 'గజినీ' కాంబో మళ్లీ గుర్తుకురావడంతో సూర్య, అసిన్ అభిమానులు ఈ పాత ఇంటర్వ్యూ క్లిప్‌ను తెగ షేర్ చేస్తున్నారు.

4 / 5
2000వ దశకంలో టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్‌లలో ఒక వెలుగు వెలిగిన అగ్ర కథానాయిక అసిన్ తోట్టుమ్కల్ (Asin). అందం, అభినయంతో పాటు అద్భుతమైన నటనతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'క్వీన్'గా రాణించిన ఈ కేరళ కుట్టి, ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ వంద కోట్ల క్లబ్‌ సినిమాలతో సంచలనం సృష్టించింది. మలయాళ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అసిన్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆమె నటించిన బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇప్పటికీ ఎవర్గ్రీన్.

5 / 5
Follow Us