చారడేసి కళ్ళు, అమాయకపు చూపులు.. ఇప్పుడు ఆ స్టార్ హీరో భార్య..
Rajitha Chanti
Pic credit - Instagram
31 May 2026
సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల త్రోబ్యాక్ పిక్స్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోతుంటారు.
తాజాగా, రెండు జడలు, చారడేసి కళ్ళు, బూరె బుగ్గలతో అమాయకంగా చూస్తున్న ఒక చిన్నారి ఫోటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఆమె అందాల తార శోభితా ధూళిపాళ్ల.
తెలుగు మూలాలున్న శోభితా ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. తెనాలిలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ, ముంబైలో చదువుకుంటూ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.
2013లో 'ఫెమినా మిస్ ఇండియా సౌత్' కిరీటాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా, మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
'రామన్ రాఘవ్ 2.0'తో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో అడివి శేష్ సరసన నటించిన 'గూఢచారి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ఇక్కడి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
ఆ తర్వాత 'మేజర్', మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్' (వనిత పాత్ర) వంటి చిత్రాలతో పాటు, 'మేడ్ ఇన్ హెవెన్' వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకుంది.
గ్లామర్ పాత్రలైనా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలైనా శోభిత తనదైన ముద్ర వేయగలదు. అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య వివాహం చేసుకుని అక్కినేని ఇంట అడుగుపెట్టింది.
ప్రస్తుతం చైతూ-శోభిత టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ లవ్లీ కపుల్‌గా నిలిచారు. పెళ్లి తర్వాత కూడా శోభిత తన కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ సరికొత్త ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతోంది.