నీకు నేను చాలా కృతజ్ఞుడిని.. మై లేడీ.. నాగచైతన్య పోస్ట్ వైరల్..
Rajitha Chanti
Pic credit - Instagram
31 May 2026
టాలీవుడ్ లవ్లీ కపుల్స్ నాగచైతన్య, శోభితా జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత వీరిద్దరూ తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
సోషల్ మీడియాలో కూడా ఈ జంటకు సంబంధించిన అప్‌డేట్స్ నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటాయి. తాజాగా చైతూ షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతుంది.
తాజాగా శోభితా ధూళిపాళ్ల పుట్టినరోజును పురస్కరించుకుని, భర్త నాగచైతన్య ఆమెకు సోషల్ మీడియా ద్వారా ఎంతో ప్రేమపూర్వకంగా, ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. నాగచైతన్య తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శోభితతో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను పంచుకున్నారు.
"పుట్టినరోజు శుభాకాంక్షలు శోభితా! నా జీవితంలోకి వచ్చినందుకు, నా ప్రపంచాన్ని ఇంత అందంగా మార్చినందుకు నీకు నేను ఎల్లప్పుడూ చాలా కృతజ్ఞుడిని" అంటూ రాసుకొచ్చారు.
చైతూ పెట్టిన ఈ ఎమోషనల్ పోస్ట్ అటు అక్కినేని అభిమానులను, ఇటు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గతేడాది నిశ్చితార్థం, ఆ తర్వాత వివాహంతో ఈ జంట ఒక్కటైంది.
పెళ్లయిన తర్వాత శోభిత పుట్టినరోజు రావడం, దానికి చైతూ ఇంత ఓపెన్‌గా తన ప్రేమను వ్యక్తపరుస్తూ విష్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
నాగచైతన్య పోస్ట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ శోభితకు బర్త్‌డే విషెస్ చెప్తున్నారు. "మేడ్ ఫర్ ఈచ్ అదర్", "క్యూట్ కపుల్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.