AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hombale Films: అదర్‌ లాంగ్వేజెస్ మీద కాన్సన్‌ట్రేట్ చేసిన కేజీఎఫ్ బ్యానర్

2014లో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కిన నిన్నిందలే సినిమాతో సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసింది హోంబలే ఫిలింస్‌. తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో..

Hombale Films: అదర్‌ లాంగ్వేజెస్ మీద కాన్సన్‌ట్రేట్ చేసిన కేజీఎఫ్ బ్యానర్
Hombale Films
Rajeev Rayala
|

Updated on: Dec 10, 2022 | 9:14 AM

Share

కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన హోంబలే ఫిలింస్‌ ఇప్పుడు నేషనల్ రేంజ్‌ను టార్గెట్ చేస్తోంది. ఆల్రెడీ పాన్ ఇండియా ప్రొడక్షన్‌ హౌస్‌గా ప్రూవ్ చేసుకున్న నిర్మాతలు.. ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా ఒక్కో లాంగ్వేజ్‌లో తన మార్క్‌ చూపించేందుకు రెడీ అవుతోంది. 2014లో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కిన నిన్నిందలే సినిమాతో సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసింది హోంబలే ఫిలింస్‌. తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో.. అదే జోష్‌లో మరిన్ని సినిమాలు లైన్‌లో పెట్టింది. అయితే తొలి అడుగుల్లోనే హోంబలే నిర్మాతలు చేసిన సాహసం ఆ సంస్థను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టాయి.

అప్పటికి కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న దర్శకుడితో… స్టార్ ఇమేజ్‌ కోసం పోటి పడుతున్న ఓ యంగ్ హీరో కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా కేజీఎఫ్‌. ఈ సినిమా హోంబలే బ్యానర్‌ రేంజ్‌ను మాత్రమే కాదు… కన్నడ సినిమా భవిష్యత్తును కూడా మార్చేసింది. కేజీఎఫ్ సక్సెస్‌ తరువాత ఇతర భాషల మీద కూడా సీరియస్‌గా దృష్టి పెట్టింది హోంబలే.. ప్రజెంట్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను నిర్మాస్తోంది ఈ సంస్థ. ఈ సినిమాతో టాలీవుడ్‌ మార్కెట్‌ను స్ట్రయిట్‌గా టార్గెట్ చేస్తున్నారు నిర్మాత విజయ్‌ కిరగందూర్‌.

ఇవి కూడా చదవండి

ఆ మధ్య సూర్య హీరోగా ఓ తమిళ సినిమా చేస్తున్నట్టుగా ఎనౌన్స్‌ చేశారు నిర్మాత విజయ్‌. ఆ మూవీ ఇంకా సెట్స్ మీదకు రాకముందే… కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో మరో మూవీని ఎనౌన్స్‌ చేశారు. ఈ సినిమాలన్నీ ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉండగానే బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తోంది ఈ బడా నిర్మాణ సంస్థ. ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్‌ ఫామ్‌ ఉన్న షారూఖ్‌ ఖాన్‌ హీరోగా ఓ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉంది హోంబలే. ఇప్పటికే రోహిత్ శెట్టి కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన షారూఖ్‌.. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు పూర్తయిన వెంటనే హోంబలేతో కలిసి వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా మూవీస్ చేస్తూనే.. ఒక్కో ఇండస్ట్రీలో సపరేట్‌ ప్రాజెక్ట్స్ చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది హెంబలే ఫిలింస్‌.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?