Anikha Surendran: ఈ చిన్నారి చిచ్చర పిడుగు హీరోయిన్‌ అయిపోయిందోచ్‌.. తెలుగు సినిమాతో..

సినిమా ఇండస్ట్రీలో చైల్డ్‌ ఆర్టిస్టులుగా రాణించి హీరోయిన్‌గా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అగ్ర హీరోల చిత్రాల్లో బాల నటిగా నటించి మెప్పించిన చిన్నారులు హీరోయిన్లుగా రాణించి ఆ హీరోల సరసన నటించిన వారు కూడా ఉన్నారు. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఈ జాబితా..

Anikha Surendran: ఈ చిన్నారి చిచ్చర పిడుగు హీరోయిన్‌ అయిపోయిందోచ్‌.. తెలుగు సినిమాతో..
Anikha Surendran
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 10, 2022 | 10:10 AM

సినిమా ఇండస్ట్రీలో చైల్డ్‌ ఆర్టిస్టులుగా రాణించి హీరోయిన్‌గా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అగ్ర హీరోల చిత్రాల్లో బాల నటిగా నటించి మెప్పించిన చిన్నారులు హీరోయిన్లుగా రాణించి ఆ హీరోల సరసన నటించిన వారు కూడా ఉన్నారు. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఈ జాబితా చాలా పెద్దదనే చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి మరో బాల నటి వచ్చి చేరింది. ఆ నటి మరెవరో కాదు అనిఖా సురేంద్రన్‌. 2007లో బాల నటిగా వెండితెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టి మలయాళం, తమిళం, తెలుగుభాషల్లో నటించి బాలనటిగా గుర్తింపు సంపాదించుకుంది.

ఇదిలా ఉంటే ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ బిజీగా మారింది అనిఖా. ఈ నేపథ్యంలో తన లేటెస్ట్‌ ఫొటోలతో ఆక్టుటకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా నాగార్జున హీరోగా నటించిన ‘ది ఘోస్ట్‌’ మూవీలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనిఖా హీరోయిన్‌గా సినిమా తెరకెక్కుతోంది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.

ఇవి కూడా చదవండి

అనిఖా తెలుగులో నటిస్తోన్న చిత్రం ‘బుట్టబొమ్మ’. శౌరీ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో అర్జున్‌ దాస్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు బాల నటిగా మెప్పించిన అనిఖా హీరోయిన్‌గా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. టాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైనా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..