AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోకు చేదు అనుభవం..పబ్లిక్‌లో చెప్పు విసిరిన వ్యక్తి.. కారణం అదేనా..

అభిమానుల మధ్యలోకి వెళ్లిన సమయంలో వారి అత్యుత్సహం.. లేదా కోపానికి సినిమా తారలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా సెల్ఫీలకు ఎగబడుతూ ఉంటారు ఫ్యాన్స్

స్టార్ హీరోకు చేదు అనుభవం..పబ్లిక్‌లో చెప్పు విసిరిన వ్యక్తి.. కారణం అదేనా..
Star Hero
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2022 | 7:54 AM

Share

సినిమా తరాలకు కొన్ని సార్లు అభిమానుల నుంచి ఘన స్వాగతాలే కాదు అప్పుడప్పుడూ చేదు అనుభవలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అభిమానుల మధ్యలోకి వెళ్లిన సమయంలో వారి అత్యుత్సహం.. లేదా కోపానికి సినిమా తారలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా సెల్ఫీలకు ఎగబడుతూ ఉంటారు ఫ్యాన్స్. అయితే తాజాగా ఓ స్టార్ హీరోకు మాత్రం దారుణమైన అవమానం జరిగింది. అభిమానుల మధ్యకు వెళ్లిన ఆ హీరోగారి పైకి ఏకంగా చెప్పులు విసిరేశారు. ఇంతకు ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..? కన్నడ స్టార్ హీరో దర్శన్. శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దర్శన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దర్శన్ కు కన్నడ నట భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే స్టార్ హీరో దర్శన్ చాలా సందర్భాల్లో వివాదాస్పద విషయాల ద్వారా వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన పై అభిమానులు చెప్పులు విసరడం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం దర్శకం క్రాంతి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సెకండ్ సాంగ్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ పాట విడుదల కోసం చిత్రయూనిట్ తో కలిసి హీరో దర్శన్ హోస్పేట్ లో ఏర్పాటు చేసిన వేడుకలో పాల్గొన్నారు. స్టేజ్ పై హీరో హీరోయిన్ మాట్లాడుతున్న సమయంలో ఓవ్యక్తి దర్శన్ పైకి చెప్పు విసిరాడు.

ఇవి కూడా చదవండి

దీనికి కారణం కొద్దిరోజుల క్రితం దర్శన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం దర్శన్ మాట్లాడుతూ అదృష్ట లక్ష్మి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.అదృష్ట లక్ష్మి పదే పదే తలుపు తట్టదనీ, తలుపుతట్టినప్పుడు ఆమెను బెడ్‌రూంలోకి తీసుకెళ్ళి బట్టలూడదీయాలంటూ సిగ్గుమాలిన కామెంట్స్‌ చేశాడు. అంతేకాదు. అదృష్ట లక్ష్మికి బట్టలిస్తే ఆమె పారిపోతుంది” అని కూడా నోరుపారేసుకున్నాడు. ఈ వ్యాఖ్యలు చాలామందికి ఆగ్రహం కలిగించాయి. అందువల్లే ఆయన పైకి చెప్పు విసిరారని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. గతంలో దర్శన్ తన భార్య విషయంలో ప్రవర్తించిన తీరు వల్ల విమర్శల పాలయ్యారు. 2011లో స్వయంగా తన భార్యపైనే దర్శన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన కన్నడ చిత్రసీమను అవాక్కయ్యేలా చేసింది.

లేటెస్ట్‌గా కన్నడ దివంగత హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి, కొత్త వివాదాల్లో ఇరుక్కున్నాడు. అదే వివాదం ఇప్పుడు దర్శన్‌పై చెప్పు దాడికి కారణమైంది. ఈ ఘటనపై పునీత్ రాజ్‌కుమార్‌ అన్న.. శివ రాజ్ కుమార్ స్పందించారు. ఈ చర్య తన హృదయాన్ని బాధించిందన్నారు. ఎవరూ మానవత్వాన్ని మరచి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని మనవి చేశారు. అభిమానంతో ప్రేమను చూపించు.. ద్వేషం అగౌరవం కాదంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. దర్శన్ కు వరుస షాకులు తగులుతుండటం ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలని దర్శన్ ను ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..