Kamal Haasan’s Vikram : వందేళ్ల చరిత్రను తిరగరాసిన కమల్ హాసన్ ‘విక్రమ్’.. అదేంటంటే

లోకనాయకుడు కమల్ హాసన్ నటించి విక్రమ్ సినిమా గురించి, ఆ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పిన తక్కువే..విక్రమ్(Vikram)సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే

Kamal Haasan's Vikram : వందేళ్ల చరిత్రను తిరగరాసిన కమల్ హాసన్ 'విక్రమ్'.. అదేంటంటే
Vikram
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 24, 2022 | 9:29 AM

లోకనాయకుడు కమల్ హాసన్ నటించి విక్రమ్((Vikram)) సినిమా గురించి, ఆ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పిన తక్కువే..విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  కమల్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. విక్రమ్ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలై భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ముఖ్యంగా చివరి నిమిషంలో సూర్య వచ్చిన సీన్స్ సినిమాను మరో లెవల్‏కు తీసుకెళ్లిందంటూ కామెంట్స్ చేశారు అభిమానులు.ఇక ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది ఈ మూవీ.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది తాజాగా ఈ సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా రన్ టైం రీసెంట్ గా ముగిసింది. వందేళ్ల తమిళ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు రానంత మంది ఈ సినిమా కోసం థియేటర్లకు వచ్చారట. ఇలా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. చాలా కాలం తర్వాత కమల్ సినిమా రీ రేంజ్ హిట్ అను అందుకొని నయా రికార్డు క్రియేట్ చేయడంతో కమల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ తన నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టారు. శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 చేస్తున్నారు కమల్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి