AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: సెన్సార్‌ సభ్యులను మెప్పించిన గాడ్‌ఫాదర్‌.. పక్కా హిట్ అంటోన్న చిత్ర దర్శకుడు..

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం గాడ్‌ఫాదర్‌. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న లూసిఫర్‌ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించిన విషయం తెలిసిందే...

Chiranjeevi: సెన్సార్‌ సభ్యులను మెప్పించిన గాడ్‌ఫాదర్‌.. పక్కా హిట్ అంటోన్న చిత్ర దర్శకుడు..
Godfather Movie
Narender Vaitla
|

Updated on: Sep 24, 2022 | 6:38 AM

Share

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం గాడ్‌ఫాదర్‌. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న లూసిఫర్‌ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తుండడం, చిరంజీవి డిఫ్రంట్‌ లుక్‌లో కనిపించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా నయనతార, సత్యదేవ్‌, సునీల్‌, అనసూయలతో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్‌ కీలక పాత్రలో నటించడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్‌ 5న విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇప్పటికే చిరంజీవితో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను దర్శకుడు మోహన్‌ రాజా అభిమానులతో షేర్‌ చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ విషయమై దర్శకుడు ట్వీట్ చేస్తూ.. ‘ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా సెన్సార్‌ సభ్యుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది’ అని రాసుకొచ్చారు. మరి దసరా బరిలో దిగుతోన్న మెగాస్టార్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తారో తెలయాలంటే అక్టోబర్‌ 5 వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తోంది. భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ఓటీటీ హక్కులతో అందరి దృష్టిని ఆకర్షించింది. గాడ్‌ ఫాదర్‌ ఓటీటీ హక్కులకు ఏకంగా రూ. 57 కోట్లుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ తెలుగు, హిందీ హక్కుల కోసం ఈ మొత్తాన్ని చెల్లిస్తుందని సమాచాచరం. విడుదలకు ముందే రికార్డుల వేట మొదలవడంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే