Sreeleela: స్టార్టింగ్‌లోనే ట్విస్ట్.. “డీజే టిల్లు” టీమ్‌కు గట్టి షాక్ ఇచ్చిన పెళ్లిసందడి భామ..

చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమాల్లో డీజే టిల్లు ఒకటి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది

Sreeleela: స్టార్టింగ్‌లోనే ట్విస్ట్.. డీజే టిల్లు టీమ్‌కు గట్టి షాక్ ఇచ్చిన పెళ్లిసందడి భామ..
Sreeleela
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 24, 2022 | 6:59 AM

చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమాల్లో డీజే టిల్లు(DJ Tillu) ఒకటి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. సిద్దు  టైమింగ్ కు నేహా అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సిద్దు తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు సీక్వెల్ పై ఆసక్తికి పెరిగింది. సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ వచ్చిన వెంటనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ పై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కు సర్వం సిద్ధం అయ్యింది. అయితే ఈ సినిమా సీక్వెల్ లో హీరోయిన్ చేంజ్ అవుతుందని తెలుస్తోంది.

డీజే టిల్లు సినిమా సీక్వెల్ లో నేహా శెట్టికి బదులు మరో హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. ఇందుకోసం పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల ను ఎంపిక చేశారని తెలుస్తోంది. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన శ్రీలీల అందం , చలాకీ తనంతో ఆకట్టుకుంది. ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలను అందుకుంటుంది. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ దర్శకత్వంలో ఈ అమ్మడు సినిమా చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు డీజే టిల్లు టీమ్ కు శ్రీలీల షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. డీజే టిల్లు సీక్వెల్ ఒప్పుకున్నా శ్రీలీల ఇప్పుడు ఆ సినిమానుంచి తప్పుకుందని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత శ్రీలీల సినిమానుంచి తప్పుకుందట. అయితే ఇందుకు కారణాలు ఏంటి అన్నది మాత్రం తెలియలేదు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో