AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej : వాళ్ల పిలుపు మేరకు సోషల్ మీడియా డీపీ చేంజ్ చేసిన మెగా హీరో..

మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలతో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Varun Tej : వాళ్ల పిలుపు మేరకు సోషల్ మీడియా డీపీ చేంజ్ చేసిన మెగా హీరో..
Varun Tej
Rajeev Rayala
|

Updated on: Sep 24, 2022 | 8:37 AM

Share

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej )కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలతో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో.. ఇక గద్దల కొండ గణేష్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు వరుణ్. మాస్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేశాడు వరుణ్. ఇక ఈ మధ్య రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు ఈ మెగా హీరో.. వాటిలో గని సినిమా ఒకటి కిరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. అలాగే అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 3. ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించి మంచి సక్సెస్ గా నిలించింది. ఇక ఇప్పుడు ఓ బయో పిక్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు వరుణ్.

ఈ క్రమంలోనే తాజాగా వరుణ్‌ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న వరుణ్‌.. మరో చిత్రాన్ని ప్రకటించాడు. వరుణ్‌ తేజ్‌ 13వ చిత్రంగా తెరకెక్కుతోన్న న్యూ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్‌ రీసెంట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అంతకు ముందు విడుదల చేసిన ఓ చిన్న వీడియో ఆసక్తిని పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రకటించడంతో అందరిలోనూ ఈ సినిమా కథపై ఇంట్రెస్టింగ్ పెరిగింది. ఇదిలా ఉంటే ట్విట్టర్ ఖాతా డీపీగా  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సింబల్ ని పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఐఎఎఫ్ పిలుపు మేరకు ఈ మెగా హీరో తన సోషల్ మీడియా డీపీని మార్చాడు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి గొప్ప నివాళిగా ఈ సినిమా ఉండబోతోంది. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా పాత్ర చాలా ఆసక్తికరంగా.. చాలా లేయర్స్ తో  ఉంటుంది. దీని కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాను అని వరుణ్ తెలిపారు.చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..
తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..
నా భార్య అబార్షన్ సమయంలో ఆ స్టార్ హీరో ఫోన్ చేశారు
నా భార్య అబార్షన్ సమయంలో ఆ స్టార్ హీరో ఫోన్ చేశారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బుధవారం వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బుధవారం వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి
కేంద్రం కొత్త టోల్ రూల్స్.. త్వరలోనే అమల్లోకి..
కేంద్రం కొత్త టోల్ రూల్స్.. త్వరలోనే అమల్లోకి..
పవన్ కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్ః పొన్నం ప్రభాకర్
పవన్ కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్ః పొన్నం ప్రభాకర్
ఎండలో ఎక్కువ సేపు గడపడం డీహైడ్రేషన్ కి కారణం కావచ్చు
ఎండలో ఎక్కువ సేపు గడపడం డీహైడ్రేషన్ కి కారణం కావచ్చు
15 ఏళ్లకే బ్లాంక్ చెక్కులు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ
15 ఏళ్లకే బ్లాంక్ చెక్కులు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ
పాత కక్షతో చోరీ.. రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
పాత కక్షతో చోరీ.. రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ఎలక్ట్రోలైట్లు అందరికీ: రోజువారీ హైడ్రేషన్ అపోహలను తొలగిద్దాం
ఎలక్ట్రోలైట్లు అందరికీ: రోజువారీ హైడ్రేషన్ అపోహలను తొలగిద్దాం
శుక్రవారం ఈ పని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం.. ఇంటినిండా డబ్బడబ్బు
శుక్రవారం ఈ పని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం.. ఇంటినిండా డబ్బడబ్బు