Kamal Haasan: ‘గర్వపడకండి.. ఎన్నో శిఖరాలను చేరుకోవాలి’.. డైరెక్టర్ శంకర్ పై కమల్ హాసన్ ఆసక్తికర ట్వీట్..

తంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చివరిదశలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాలు చూసిన కమల్ ఆశ్చర్యపోయారు. శంకర్ రూపొందిస్తున్న ఆ సీన్స్ చూసి ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ఆయనకు ఖరీదైన వాచ్‏ను బహుమతిగా ఇచ్చారు. దీని ధర రూ.8 లక్షలని సమాచారం. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు శంకర్.

Kamal Haasan: 'గర్వపడకండి.. ఎన్నో శిఖరాలను చేరుకోవాలి'.. డైరెక్టర్ శంకర్ పై కమల్ హాసన్ ఆసక్తికర ట్వీట్..
Kamal Haasan, Shankar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 29, 2023 | 2:55 PM

ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్. ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 చిత్రాలను రూపొందిస్తున్నారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాకు కాస్త బ్రేక్ తీసుకోవడంతో.. ఇప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్‏తో ఇండియన్ 2 మూవీ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు శంకర్. వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ కావడంతో ఈ మూవీపై ఎక్కువగానే అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చివరిదశలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాలు చూసిన కమల్ ఆశ్చర్యపోయారు. శంకర్ రూపొందిస్తున్న ఆ సీన్స్ చూసి ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ఆయనకు ఖరీదైన వాచ్‏ను బహుమతిగా ఇచ్చారు. దీని ధర రూ.8 లక్షలని సమాచారం. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు శంకర్.

“ఈరోజు ఇండియన్ 2 చిత్రంలోని ప్రధాన సన్నివేశాలను చూశాను. శంకర్ కు నా అభినందనలు. ఈ సినిమానే మీ అత్యుత్తమ వర్క్ కాకూడదు. ఇది మీ కళాత్మక జీవితంలోనే అత్యుత్తమ దశ. అందుకే దీనితో మీరు గర్వపడకండి అని నా సలహా. మీరు ఇంకా ఎన్నో శిఖరాగ్రాలకు చేరాలని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు కమల్ హాసన్.

ఇవి కూడా చదవండి

ఇక కమల్ ట్వీట్‏ను రీట్వీట్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు శంకర్. “నా హృదయం ఆనందం, కృతజ్ఞతతో నిండిపోయింది సర్. నేను ఎప్పటికీ నా బెస్ట్ వర్క్ ఇవ్వడం ఆపను. మీ పర్ఫార్మెన్స్, ప్రెజెన్స్ ఈ సినిమాకు కావాల్సిన ప్రత్యేకతలను తీసుకువచ్చిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రత్యేక క్షణాన్ని గుర్తుచేసుకోవడానికి టోకెన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తాను” అంటూ రాసుకోచ్చారు. ఈ సినిమాను వచ్చే ఏడాది అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.