Kalyan Ram: క్రిటికల్‌గానే తారకరత్న ఆరోగ్యం.. ‘అమిగోస్’ సాంగ్ వాయిదా వేసిన కళ్యాణ్ రామ్..
ఇంకా ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని.. పది మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. దీంతో అటు నందమూరి కుటుంబ సభ్యులతోపాటు..అభిమానులు.. టీడీపీ కార్యకర్తలలో ఆందోళన ఎక్కువైంది.
నారాలోకేష్ శుక్రవారం మొదలుపెట్టిన యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న స్పృహతప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్‌తోపాటు.. బాలకృష్ణ.. తారకరత్న ప్రార్ధనలు చేశారు. అదే సమయంలో ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో..ఆయన ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. దీంతో వెంటనే ఆయనను సమీపంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ హాస్పటల్‌కు తీసుకెళ్లారు. శుక్రవారం అర్దరాత్రి ఆయనను బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక శనివారం తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు నారాయణ హృదయాలయ వైద్యులు. ఇంకా ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని.. పది మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. దీంతో అటు నందమూరి కుటుంబ సభ్యులతోపాటు..అభిమానులు.. టీడీపీ కార్యకర్తలలో ఆందోళన ఎక్కువైంది. అయితే ఓవైపు తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన చెందుతుంటే.. తన సినిమా ప్రమోషన్లను ఆపేశారు హీరో కళ్యాణ్ రామ్.
ఆయన నటిస్తోన్న అమిగోస్ చిత్రం ఫిబ్రవరి నెలలో విడుదలకు సిద్ధమవుతుంది. దీంతో కొద్ది రోజులుగా ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఈ చిత్రం నుంచి ఎన్నో రాత్రులోస్తాయి గానీ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ఫుల్ సాంగ్ వీడియోను జనవరి 29న విడుదల చేయాల్సి ఉంది. కానీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ పాట విడుదలను వాయిదా వేస్తున్నామని.. సోమవారం ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నామని.. తారకరత్న గారు త్వరగా కోలుకోవాలంటూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన విడుదల చేశారు.
ఇదిలా ఉంటే.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నిన్నటి నుంచి బాలకృష్ణ, చంద్రబాబు, గోరంట్ల సుబ్బయ్య దగ్గరుండి చూసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి తారకరత్న భార్య.. కూతురు ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే సోదరుడి ఆరోగ్య పరిస్థితి గురించి తన బాబాయ్ బాలయ్యకు కాల్ చేసి తెలుసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎప్పటికప్పుడు డాక్టర్స్, బాలకృష్ణతో మాట్లాడుతూ హెల్త్ అప్డేట్ తెలుసుకుంటున్నారు చంద్రబాబు.
The song launch of #EnnoRatrulosthayi from #Amigos stands postponed to a later date.
Praying & Wishing Sri. Taraka Ratna Garu a speedy recovery. pic.twitter.com/UQAKDQTKNU
— Mythri Movie Makers (@MythriOfficial) January 28, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.