Deepika Padukone: ‘మీ ఆలోచనలు కూడా అందమే’.. ఆ మంచి పని కోసం ఎల్లో గౌన్ అమ్మేసిన దీపిక.. ఎంత డబ్బు వచ్చిందంటే?
ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్లి బేబీ బంప్‌తో ప్రత్యక్షమైంది దీపిక. అయితే కొందరు జనాలు మాత్రం అది నిజమైన బేబీ బంప్ కాదని, ఆము సరోగసి విధానాన్ని ఎంచుకుందని అనుమానం వ్యక్తం చేశారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదంటూ ఇటీవల మరోసారి బేబీ బంప్ తో దర్శనమిచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణె ఇప్పుడు సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ప్రస్తుతం గర్భంతో ఉంది. తన మొదటి బిడ్డ రాక కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్లి బేబీ బంప్‌తో ప్రత్యక్షమైంది దీపిక. అయితే కొందరు జనాలు మాత్రం అది నిజమైన బేబీ బంప్ కాదని, ఆము సరోగసి విధానాన్ని ఎంచుకుందని అనుమానం వ్యక్తం చేశారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదంటూ ఇటీవల మరోసారి బేబీ బంప్ తో దర్శనమిచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తన సొంత ఫ్యాషన్ బిజినెస్ 82 ఈస్ట్ ఆఫ్‌లైన్ స్టోర్‌లో షేర్ చేసిన ఈ ఫొటోల్లో దీపిక ఎల్లో కలర్ గౌన్ లో ఎంతో అందంగా మెరిసిపోయింది. ఫ్యాషన్ ప్రియులు కూడా దీపిక డ్రెస్ ను తెగ మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆ దుస్తులను అమ్మేసిందీ బాలీవుడ్ నటి. సోమవారం (మే 27) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ దుస్తులు అమ్మకానికి ఉందని చెబుతూ ఒక ఫోటోను పంచుకుంది దీపిక. ఆ ఫోటో షేర్ చేసిన 20 నిమిషాల్లోనే ఎల్లో గౌన్ ఏకంగా రూ.34,000 అమ్ముడుపోయింది. దీంతో దీపిక వెంటనే ఎల్లో గౌన్ డ్రెస్ సోల్డ్ ఔట్ అని మరో ఫొటో షేర్ చేసింది.
20 నిమిషాల్లోనే సోల్డ్ ఔట్..
కాగా ఈ డ్రెస్ అమ్మగా వచ్చిన రూ.34,000 నగదును సామాజిక సేవ కార్యక్రమాల కోసం వినియోగించనుంది దీపిక. ‘ద లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ పేరుతో నిర్వహిస్తోన్న చారీటీ సంస్థకు ఈ నగదును అంజేయనుందీ అందాల తార. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు దీపికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీపిక ఆలోచనలు కూడా చాలా అందంగా ఉన్నాయి. మీరు చాలా గ్రేట్ మేడమ్ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
కల్కితో అభిమానుల ముందుకు..
గర్భంతో ఉండడంతో దీపికా పదుకొణె ప్రస్తుతానికి సినిమా పనుల నుంచి విరామం తీసుకుంది. దీనిక నటించిన మొదటి తెలుగు సినిమా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. జూన్ 27న సినిమా విడుదల కానుంది. దీంతో పాటు ‘సింగం అగైన్’ సినిమాలో కూడా దీపికా పదుకొణే ఓ ముఖ్య పాత్రలో నటించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




