Devara: మరో 250 రోజుల్లో ‘దేవర’ ఆగమనం.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మేకర్స్..
పాన్ ఇండియా లెవల్లో భారీ హంగులతో తెరకెక్కిస్తోన్న ఈ ఫుల్ యాక్షన్ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. అంతేకాకుండా.. ఆమె ఎంతో అభిమానించే హీరో సరసన నటిస్తుండడంతో ఈ మూవీపై జాన్వీ సైతం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా దేవర. ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య డిజాస్టర్ తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో దేవరపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు డైరెక్టర్ కొరటాల శివ. ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గతంలో విడుదల చేసిన టైటిల్ వీడియోతో సినిమా ఏరెంజ్లో ఉంటుందో చెప్పేశారు చిత్రయూనిట్. పాన్ ఇండియా లెవల్లో భారీ హంగులతో తెరకెక్కిస్తోన్న ఈ ఫుల్ యాక్షన్ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. అంతేకాకుండా.. ఆమె ఎంతో అభిమానించే హీరో సరసన నటిస్తుండడంతో ఈ మూవీపై జాన్వీ సైతం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేస్తూ అభిమానులను అలర్ట్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక ఇదే విషయాన్ని మరోసారి తెలియజేస్తూ.. మరో 250 రోజుల్లో దేవర ఆగమనం అంటూ ట్వీట్ చేసింది చిత్రబృందం. టైటిల్ విడుదల సమయంలో రిలీజ్ చేసిన వీడియోను మరోసారి షేర్ చేశారు మేకర్స్.




ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా..భారీ బడ్జెట్ తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ ఫుల్ మాస్, యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత తారక్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
250 days to witness fear unleash on the big screen 💥🌊
Vastunna….#Devara from 5th April 2024. pic.twitter.com/CCaARI8Fwm
— Devara (@DevaraMovie) July 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.