Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Krishna: ఆ ఎనర్జీ ఏంటీ మేడమ్ ?.. తమన్నా ‘నువ్వు కావాలయ్యా’ పాటలకు రమ్యకృష్ణ డ్యాన్స్ అదిరిపోయింది..

సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న జైలర్ సినిమాలోనిది ఈ సాంగ్. ఇందులో రజినీ జోడిగా మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సునీల్, రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్, యోగిబాబు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 10న అడియన్స్ ముందుకు రానుంది.

Ramya Krishna: ఆ ఎనర్జీ ఏంటీ మేడమ్ ?.. తమన్నా 'నువ్వు కావాలయ్యా' పాటలకు రమ్యకృష్ణ డ్యాన్స్ అదిరిపోయింది..
Ramya Krishnan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 30, 2023 | 2:52 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో నువ్వు కావాలయ్యా సాంగ్ ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా ఇదే సాంగ్ చక్కర్లు కొడుతుంది. సామాన్యులు, సెలబ్రెటీస్ ఈ పాటకు స్టెప్పులేస్తూ అదరగొట్టేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న జైలర్ సినిమాలోనిది ఈ సాంగ్. ఇందులో రజినీ జోడిగా మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సునీల్, రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్, యోగిబాబు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 10న అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఈ మూవీలోనే ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నువ్వు కావాలయ్యా అంటూ సాగే ఈ పాట శ్రోతలన్ని ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ పాటకు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టింది. తన వ్యానిటీ వ్యాన్‏లో తన ముగ్గురు సిబ్బందితో కలిసి నువ్వు కావాలయ్యా పాటకు డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. 52 ఏళ్ల వయసులో ఇంత ఎనర్జిటీతో డాన్స్ చేయడం నమ్మలేకపోతున్నామని.. ఇప్పటికే ఎంతో గ్లామర్.. ఫర్ఫెక్ట్ లుక్‏లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. నువ్వు కావాలయ్యా ఫుల్ సాంగ్ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగింది. సూపర్ స్టార్ రజినతోపాటు.. ఎంతో మంది అభిమానులు హాజరయ్యారు. తమన్నాతోపాటు.. రజినీ కలిసి ఈ పాటకు సిగ్నేచర్ స్టెప్పులేశారు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు నెట్టింట వైరలవుతున్న ఈ పాటను శిల్పారావ్, అనిరుధ్ రవిచందర్ కలిసి ఆలపించారు. అరుణ్ రాజా కామరాజ్ సాహిత్యం అందిచంగా.అనిరుధ్ సంగీతం అందించారు. భారీ అచంనాల మధ్య తెరకెక్కినఈ సినిమా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, మోహన్ లాల్ కీలకపాత్రలలో నటించగా.. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ప్రతినాయకుడిగా కనిపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.