AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Movie: బేబీ మూవీని మళ్లీ చూడాల్సిందే ఇక.. మరిన్ని సీన్స్ యాడ్ చేశారంట..

ముఖ్యంగా యూత్ నుంచి ఈ ట్రైయాంగిల్ ప్రేమకథకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.75 కోట్లు వసూళ్లు చేసి రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది బేబీ చిత్రం. సినీ ప్రముఖులు సైతం బేబీ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

Baby Movie: బేబీ మూవీని మళ్లీ చూడాల్సిందే ఇక.. మరిన్ని సీన్స్ యాడ్ చేశారంట..
Baby Movie
Rajitha Chanti
|

Updated on: Jul 29, 2023 | 3:27 PM

Share

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం బేబీ. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా యూత్ నుంచి ఈ ట్రైయాంగిల్ ప్రేమకథకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.75 కోట్లు వసూళ్లు చేసి రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది బేబీ చిత్రం. సినీ ప్రముఖులు సైతం బేబీ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

తాజాగా ఈ సినిమాలో కొత్త పాట సహా దాదాపు 14 నిమిషాలపాటు కట్ చేసిన సీన్స్ మళ్లీ యాడ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి బేబీ కొత్త వెర్షన్ సినిమా థియేటర్లలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అంటే ఇప్పుడీ బేబీ సినిమా దాదాపు 185 నిమిషాలు ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమాను ఒకటి కంటే ఎక్కువసార్లు చూసిన యూవత ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మరిన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ యాడ్ చేస్తుండడంతో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా..కొత్తగా యాడ్ చేసిన సీన్స్ ఈసారి ప్రేక్షకులను మరింత కనెక్ట్ కానున్నట్లు తెలుస్తోంది. గతంలో దర్శకధీరుడు రాజమౌళి సైతం తన సినిమాలకు విడుదలైన తర్వాత మరిన్ని సీన్స్ యాడ్ చేసి అడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇప్పుడు డైరెక్టర్ సాయి రాజేష్ కూడా అదే పద్దతిని పాటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని ఎస్కేఎన్ నిర్మించగా… విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ఈ మూవీలోని ప్రతి సాంగ్ యూట్యూబ్‏లో మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. బేబీ చిత్రంలో ఆనంద్, వైష్ణవి నటన వేరేలెవల్. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను నవ్వించడమే కాదు.. కంటతడి పెట్టించాయి. ముఖ్యంగా ఈ సినిమా వైష్ణవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తెలుగమ్మాయికి మరిన్ని ఛాన్స్ లు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..