Anushka Shetty: అనుష్క అభిమానులకు సారి చెప్పిన మేకర్స్.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాపై ఆసక్తికర ట్వీట్..

సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నటిస్తోంది. ఇందులో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. గతంలో విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు మహేష్ బాబు . పి దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. నవీన్ పొలిశెట్టి సరసన అనుష్క నటిస్తోన్న తొలి చిత్రం ఇదే కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Anushka Shetty: అనుష్క అభిమానులకు సారి చెప్పిన మేకర్స్.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాపై ఆసక్తికర ట్వీట్..
Miss Shetty Mr Polishetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 29, 2023 | 3:51 PM

దాదాపు మూడేళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది హీరోయిన్ అనుష్క. బాహుబలి సినిమా తర్వాత సైలెంట్ అయిన స్వీటీ.. ఆ తర్వాత నిశ్శబ్దం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నటిస్తోంది. ఇందులో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. గతంలో విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు మహేష్ బాబు . పి దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. నవీన్ పొలిశెట్టి సరసన అనుష్క నటిస్తోన్న తొలి చిత్రం ఇదే కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే జాతి రత్నాలు తర్వాత నవీన్ నటిస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. ఆయన కామెడీ టైమింగ్, యాక్టింగ్ మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసేందుకు అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 4న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వార్తలు నిజమంటూ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ఈ సినిమాను ఆగస్ట్ 4న విడుదల చేద్దామనుకున్నామని.. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వలన ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని పేర్కొంది. అన్ లిమిటెడ్ ఫన్, ఎంటర్టైన్మెంట్ తో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని ప్రకటించింది. కొత్త విడుదల తేదీ.. ట్రైలర్ రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నామని.. గుండె లోతుల నుంచి అభిమానులకు క్షమాపణలు చెబుతున్నామంటూ ట్వీట్ చేశారు. దీంతో అటు స్వీట్ ఫ్యాన్స్, నవీన్ పోలిశెట్టి అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే యూవీ క్రియేషన్స్ ట్వీట్ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదేం కొత్త కాదని.. ఎప్పుడూ జరిగేదే అని ఒకరు కామెంట్ చేయగా.. ఎప్పుడు చెప్పిన సమయానికి రిలీజ్ చేశారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. రథన్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.