Rangabali: ‘రంగబలి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ కానుందంటే..

ఇప్పటికే సామజవరగమన, నాయకుడు వంటి మూవీస్ మంచి విజయం సాధించాయి. కానీ నెల తిరగకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగుతోపాటు,తమిళం, కన్నడ, మలయాళం భాషలలోని సినిమాల పరిస్థితి కూడా ఇదే. రిలీజ్ అయిన నెల రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో మూవీ వచ్చి చేరింది. అదే రంగబలి.

Rangabali: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ కానుందంటే..
Rangabali Ott
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 29, 2023 | 4:46 PM

ప్రస్తుతం ఓటీటీల హావా పెరిగిపోయింది. సినీప్రియులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ వెబ్ సిరీస్, ఇంట్రెస్టింగ్ షోస్ తీసుకురావడమే కాదు.. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాను త్వరగా స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. విడుదలైన కొద్ది రోజులకే కొన్ని సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే సామజవరగమన, నాయకుడు వంటి మూవీస్ మంచి విజయం సాధించాయి. కానీ నెల తిరగకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగుతోపాటు,తమిళం, కన్నడ, మలయాళం భాషలలోని సినిమాల పరిస్థితి కూడా ఇదే. రిలీజ్ అయిన నెల రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో మూవీ వచ్చి చేరింది. అదే రంగబలి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య నటించిన ఈ చిత్రం త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.

జూలై 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో యుక్తి తరేజా కథానాయికగా నటించింది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. డైరెక్టర్ పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో శరత్ కుమార్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలు పోషించారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‏లో ఆగస్ట్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో వచ్చేస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేకపోయింది రంగబలి. ఇక ఇప్పుడు ఓటీటీ వేదికపై అలరించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.