BRO Movie: బాక్సాఫీస్‌ వద్ద ‘బ్రో’ జోరు.. రెండు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లో చేరిన పవన్‌, తేజ్‌ల మల్టీస్టారర్

భారీ అంచనాలతో జులై 28న విడుదలైన బ్రో బాక్సాఫీస్‌ వద్ద డీసెంట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా వింటేజ్‌ పవన్‌ను చూసేందుకు పవన్‌ ఫ్యాన్స్‌ థియేటర్ల వద్ద అభిమానులు క్యూ కడుతున్నారు. ఇక సినిమాలో ఎమోషనల్‌ సీన్స్‌కు సగటు సినీ ప్రేక్షకులు కూడా కనెక్ట్‌ అవుతున్నారు.

BRO Movie: బాక్సాఫీస్‌ వద్ద 'బ్రో' జోరు.. రెండు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లో చేరిన పవన్‌, తేజ్‌ల మల్టీస్టారర్
Bro Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 30, 2023 | 2:48 PM

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన మెగా మల్టీ స్టారర్‌ చిత్రం ‘బ్రో’. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ హీరోయిన్స్‌గా కనిపించారు. భారీ అంచనాలతో జులై 28న విడుదలైన బ్రో బాక్సాఫీస్‌ వద్ద డీసెంట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా వింటేజ్‌ పవన్‌ను చూసేందుకు పవన్‌ ఫ్యాన్స్‌ థియేటర్ల వద్ద అభిమానులు క్యూ కడుతున్నారు. ఇక సినిమాలో ఎమోషనల్‌ సీన్స్‌కు సగటు సినీ ప్రేక్షకులు కూడా కనెక్ట్‌ అవుతున్నారు. దీంతో మొదటి రోజే రూ. 30.05 కోట్లు వసూళ్లు చేసి పవన్ కల్యాణ్  స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది బ్రో. అయితే రెండో రోజు పవన్‌ మూవీ హడావిడి కాస్త తగ్గింది. అయితే రిలీజైన రెండు రోజుల్లోనే ఏకంగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. ట్రేడ్‌ నిపుణుల అంచనాల ప్రకారం.. బ్రో సినిమా శనివారం (జులై 29) రూ. 20కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఆదివారం కాబట్టి మూడో రోజు వసూళ్లు మరింతగా పెరగవచ్చు.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ తెరకెక్కించిన బ్రో సినిమాలో ఊర్వశి రౌతెలా స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. ఇక థమన్‌ అందించిన స్వరాలు, బీజీఎం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. అలాగే త్రివిక్రమ్‌ అందించిన డైలాగులు, స్క్రీన్‌ప్లే సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ సినిమాలో మార్క్‌గా సాయి ధరమ్‌ తేజ్‌, టైటాన్‌ పాత్రల్లో పవన్‌ కల్యాణ్‌ నటించారు. కాగా బరిలో పెద్ద సినిమాలు లేకుండడం, బ్రో స్పీడు చూస్తుంటే త్వరలోనే ఈ మెగా మల్టీస్టారర్‌ వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలున్నాయని ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?