Actress: ‘ట్రాన్స్‌జెండర్‌’లా మారిపోయిన ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఈ అందానికి ప్రపంచమే ఫిదా అయ్యింది

పై ఫొటోలో ట్రాన్స్‌జెండర్‌గా కనిపిస్తున్న స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? ఈమె ఒక బాలీవుడ్‌ ప్రముఖ నటి. అలాగనీ అక్కడికే పరిమితం కాలేదు. ప్రపంచమంతా ఈమె అందానికి ఫిదా అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు ఈ సుందరి సుపరిచితమే.

Actress: ‘ట్రాన్స్‌జెండర్‌’లా మారిపోయిన ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఈ అందానికి ప్రపంచమే ఫిదా అయ్యింది
Actress
Follow us
Basha Shek

|

Updated on: Jul 30, 2023 | 6:13 PM

పై ఫొటోలో ట్రాన్స్‌జెండర్‌గా కనిపిస్తున్న స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? ఈమె ఒక బాలీవుడ్‌ ప్రముఖ నటి. అలాగనీ అక్కడికే పరిమితం కాలేదు. ప్రపంచమంతా ఈమె అందానికి ఫిదా అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు ఈ సుందరి సుపరిచితమే. ఓ స్టార్‌ హీరో సినిమాలో నటించి ఇక్కడి కుర్రకారుకు కునుకులేకుండా చేసింది. ఇక సినిమాలతో పాటు ఇతర విషయాలతోనూ ఎక్కువగా వార్తల్లో నిలిచిందీ అందాల తార. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌ విషయంలో పలు రూమర్లు తెరమీదకు వచ్చాయి. పలువురి హీరోలతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. అలాగే తనకంటే చిన్నవాడితో ప్రేమలో పడడం, బ్రేకప్‌ చెప్పేయడమూ జరిగింది. వీటన్నిటిని పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ మనసు అందమే. పెళ్లి చేసుకోనప్పటికీ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని అమ్మలా లాలిస్తోంది. కొన్ని నెలల క్రితం ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్‌మోడీతో రిలేషన్‌షిప్‌తో ఉందంటూ పుకార్లు వచ్చాయి. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్‌.. ఆమె మరెవరో కాదు మాజీ విశ్వసుందరి, ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌. తన కొత్త సినిమా ‘తాళి’లో ఒక ట్రాన్స్‌జెండర్‌ రోల్‌ పోషిస్తోంది సుస్మిత. ఇటీవలే ఈ మూవీ టీజర్‌ రిలీజ్ కాగా అందులో సుస్మిత ఫొటోలు ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

1994లో విశ్వసుందరి కిరీటం గెల్చుకుని అందరి దృష్టిని ఆకర్షించింది సుస్మిత. ఆతర్వాత హిందీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. అక్కినేని నాగార్జున సరసన రక్షకుడు సినిమాలో సోనియాగా సుస్మిత రోల్‌ చాలామందికి గుర్తుంటుంది. అలాగే అర్జున్‌ ఒకే ఒక్కడు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. కాగా ఇటీవల గుండెపోటుకు గురైన ఆమె సర్జరీ చేయించుకుంది. చివరిసారిగా ఆర్య అనే వెబ్‌ సిరీస్‌లో కనిపించిన సుస్మిత ఇప్పుడు మళ్లీ స్క్రీన్‌పై మెరిసేందుకు సిద్ధమైంది. ఆమె నటిస్తోన్న కొత్త సినిమా తాళి. ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ గౌరీ సావంత్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఆగస్టు 15న జియో సినిమా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..