AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRO Movie: బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోన్న ‘బ్రో’.. ఈ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా ?..

సోషియో ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ముఖ్యంగా పవన్ వింటేజ్ లుక్ చూసి థియేటర్లలో ఫ్యాన్స్ అరుపులు, విజల్స్ తో అదరగొట్టారు. ముఖ్యంగా ఈమూవీలో చివరి 15 నిమిషాలు అడియన్స్ ను కంటతడి పెట్టించారు. ఇక ఈ మూడు రోజుల్లో బ్రో సినిమాకు భారీగానే కలెక్షన్స్ వచ్చాయి.

BRO Movie: బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోన్న 'బ్రో'.. ఈ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా ?..
Bro Movie
Rajitha Chanti
|

Updated on: Jul 30, 2023 | 3:44 PM

Share

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు బ్రో సినిమా అదరగొడుతుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమా జూలై 28న విడుదలై మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వినోదయ సీతమ్ సినిమాకు తెలుగు రీమేక్‏గా ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. సోషియో ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ముఖ్యంగా పవన్ వింటేజ్ లుక్ చూసి థియేటర్లలో ఫ్యాన్స్ అరుపులు, విజల్స్ తో అదరగొట్టారు. ముఖ్యంగా ఈమూవీలో చివరి 15 నిమిషాలు అడియన్స్ ను కంటతడి పెట్టించారు. ఇక ఈ మూడు రోజుల్లో బ్రో సినిమాకు భారీగానే కలెక్షన్స్ వచ్చాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అదేంటంటే.. పవన్, సాయి తేజ్ కలిసి నటించిన ఈ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ బ్రో కాదట. మొదట ఈ సినిమాకు కాల పురుషుడు అనే టైటిల్ అనుకున్నారట. ఈ సినిమా టైటిల్ వినడానికి పవర్ ఫుల్ గా .. మాస్ గా ఉండడం… సినిమా కంటెంట్ పై తప్పు అంచనాలకు దారితీస్తుందని భావించి బ్రో అని ఫిక్స్ చేసినట్లు గతంలో డైరెక్టర్ సముద్రఖని తెలిపారు. ఈ సినిమా ఒరిజినల్లో సముద్రఖని నటించడమే కాదు.. దర్శకత్వం వహించారు. ఇక తెలుగు వెర్షన్ కు సముద్రఖని డైరెక్షన్ చేయగా.. స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో మొదటిసారి సాయి తేజ్, పవన్ కలిసి నటించడంతో భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటించారు. ఇక రెండు రోజుల్లో బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా 27 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి.. మొత్తం రెండు రోజుల్లో రూ.75 కోట్ల 70 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. పవన్ కెరీర్ లో రెండు రోజుల్లోనే ఇన్ని కలెక్షన్స్ రాబట్టడం ఇదే తొలిసారి.

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ