AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఆఫ్‌లైన్‌లో రైల్వే టికెట్ తీసుకుంటున్నారా..? ఇలా చెల్లిస్తేనే రూ.10 లక్షల బీమా.. మిస్ కాకండి..

సుప్రీంకోర్టు కీలక తీర్పుతో రైల్వే కౌంటర్ల నుంచి కొనుగోలు చేసే టికెట్లకు కూడా రూ.10 లక్షల ప్రమాద బీమా అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 27 నుంచి దీనిని అమలు చేస్తున్నారు. ఇది కోట్లాది మంది సామాన్య ప్రయాణికులకు పెద్ద ఊరటగా చెప్పవచ్చు. అయితే మీకు ఈ బీమా కావాలనుకుంటే ఈ విధానంలో మాత్రమే పేమెంట్ చేయాలి.

Indian Railways: ఆఫ్‌లైన్‌లో రైల్వే టికెట్ తీసుకుంటున్నారా..? ఇలా చెల్లిస్తేనే రూ.10 లక్షల బీమా.. మిస్ కాకండి..
Indian Railways
Venkatrao Lella
|

Updated on: Nov 02, 2026 | 1:54 PM

Share

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే కౌంటర్లలో కొనుగోలు చేసే టికెట్లకు కూడా రూ.10 లక్షల ప్రమాద బీమా సదుపాయం అందించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 27వ తేదీ నుంచే ఈ సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మాత్రమే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి ఉండేది. కేవలం 45 పైసలు చెల్లిస్తే రూ.10 లక్షల ప్రమాద బీమా దీని ద్వారా ప్రయాణికులకు ఎప్పటినుంచో లభిస్తుంది. దీని వల్ల రైలు ప్రమాదంలో మరణించినా లేదా గాయాలైనా, అంగవైకల్యం పొందినా రూ.10 లక్షల వరకు క్లెయిమ్ లభిస్తుంది. అయితే కౌంటర్లలో కొనుగోలు చేేసే టికెట్లకు ఈ ఇన్సూరెన్స్ సదుపాయం మొన్నటివరకు లేదు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి టికెట్ కొనే లక్షలాది మంది సామాన్య, పేద ప్రయాణికులకు  ఈ బీమా సదుపాయం అందుబాటులో లేదు.

ఆఫ్‌లైన్ టికెట్లకు కూడా రూ.10 లక్షల బీమా

ఆన్‌లైన్ ప్రయాణికులకు ఒకలా, కౌంటర్ టికెట్ దారులకు మరొకలా భద్రత కల్పించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైలు ప్రయాణికులందరికీ సమాన రక్షణ కల్పించాలని రైల్వేశాఖను ఆదేశించింది. అక్టోబర్ 27 నుంచే కౌంటర్ టికెట్లకు బీమా వర్తింపజేయాలని తుది తీర్పు వెలువరించింది.  ఈ ఆదేశాలను అమలు చేయకపోతే  పూర్తి బాధ్యత రైల్వే బోర్డు వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు రోజూ కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసే కోట్లాది మంది సాధారణ, పేద రైలు ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. దీని వల్ల అక్టోబర్ 27 నుంచి కౌంటర్లో టికెట్ తీసుకునే ప్రతి ఒక్కరూ ఈ రూ.10 లక్షల బీమా రక్షణను పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

డిజిటల్ విధానంలో పేమెంట్ చేస్తేనే..

అయితే రైల్వే కౌంటర్ల వద్ద మీరు టికెట్ కొనుగోలు చేసేటప్పుడు ప్రయాణ బీమా కావాలనుకుంటే నగదు రూపంలో చెల్లించకూడదు. కేవలం డిజిటల్ విధానంలో మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. మీకు ప్రయాణ బీమా వద్దనుకుంటే నగదు రూపంలో చెల్లించి టికెట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రయాణ బీమా ప్రీమియం 45 పైసలుగా ఉంది. మీరు నగదు రూపంలో చెల్లించాలంటే చిల్లర చెల్లింపు సమస్య ఉంటుంది. 45 పైసలు నగదు రూపంలో చెల్లించడం కష్టం. దీంతో పూర్తి డిజిటల్ చెల్లింపు విధానం అమలు చేస్తున్నారు. అయితే ఈ  ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక మీ మొబైల్, మెయిల్ ఐడీకి ఇన్సూరెన్స్ కంపెనీ వివరాలు అందుతాయి. దాని ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు.

Follow Us
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు