jr NTR: పక్క ప్లాన్‌తో రానున్న తారక్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీంగా నటించి ఆకట్టుకున్నారు తారక్.

jr NTR: పక్క ప్లాన్‌తో రానున్న తారక్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీ
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: May 17, 2022 | 6:14 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్(jr NTR) ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీంగా నటించి ఆకట్టుకున్నారు తారక్. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు తారక్. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమాగా కొరటాల శివ మూవీ రానుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ మూవీ మంచి హిట్ ను సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు ఏ సినిమా పైన అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 20వ తేదీన తారక్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల సినిమాను లాంచ్ చేయనున్నారని తెలుస్తుంది. జూన్ లేదా జులై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు.

శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్స్ కి తీసుకుని రావాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీ  కొరటాల మార్క్ సినిమాగానే సందేశాన్ని ఇచ్చే మూవీ అని చెబుతున్నారు. ఈ సినిమా తరువాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో సినిమా చేయనున్నారు తారక్.. అలాగే  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నారు. కేజీఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ప్రశాంత్ నీల్.. తారక్ ఇమేజ్ కి తగినట్టుగా ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తారక్ బిజీగా గడపనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Keerthy Suresh: ఆడిపోయే ఫోజులతో కవ్విస్తున్న కళావతి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Sreemukhi: యెల్లో డ్రెస్ లో యాంకరమ్మ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. శ్రీముఖి లేటెస్ట్ పిక్స్

Shamna Kasim: పింక్ శారీ లో పూర్ణ పరువాల విందు.. వైరల్ అవుతున్న షామ్నా లేటెస్ట్ పిక్స్