NTR: ఆర్ఆర్ఆర్ కోసం జపాన్‏లో తారక్.. స్టైలిష్ లుక్‏లో అదిరిపోయిన ఎన్టీఆర్..

అక్టోబర్ 21న ఈ సినిమాను అక్కడ విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం జక్కన్నతోపాటు తారక్, చరణ్ కూడా జపాన్ పయనమయ్యారు.

NTR: ఆర్ఆర్ఆర్ కోసం జపాన్‏లో తారక్.. స్టైలిష్ లుక్‏లో అదిరిపోయిన ఎన్టీఆర్..
Ntr, Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 18, 2022 | 9:21 PM

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాకు ఊహించిని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికాలోనూ ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వచ్చింది. విదేశాల్లో సైతం సత్తా చాటిన ఈ సినిమాను ఇప్పుడు జపాన్‏లో విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 21న ఈ సినిమాను అక్కడ విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం జక్కన్నతోపాటు తారక్, చరణ్ కూడా జపాన్ పయనమయ్యారు. తన సతీమణి ఉపాసనతో రామ్ చరణ్ జపాన్ చేరుకోగా.. మరోవైపు తారక్ కూడా తన భార్య, పిల్లలతో కలిసి జపాన్ వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ విమానాశ్రయంలో తన ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న తారక్ కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

తాజాగా వైరలవుతున్న ఫోటోస్, వీడియోలలో తారక్ మరింత స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. లుక్ అదిరిపోయిందని.. తన నెక్ట్స్ సినిమా అప్డేట్స్ ఉంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జపాన్‏లో అక్టోబర్ 21న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాబోతుండడంతో అక్కడ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినున్నారు జక్కన్న. జపాన్‌లో RRR కి విపరీతమైన క్రేజ్ ఉన్నందున ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రస్తుతం తారక్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ మూవీలో నటించే హీరోయిన్ గురించి ఇప్పటికే పలు రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రష్మిక, శ్రీలీల, కీర్తి సురేష్, జాన్వీ కపూర్ అంటూ పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.