RRR: జక్కన్న చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మరో రికార్డు.. రీసెంట్ డేస్‌లో రేర్ ఫీట్

RRR: జక్కన్న చెక్కిన 'ఆర్ఆర్ఆర్' మరో రికార్డు.. రీసెంట్ డేస్‌లో రేర్ ఫీట్
Rrr

ఫిల్మ్ ఇండస్ట్రీ ఫాస్ట్ ఫార్వడ్‌లోకి వెళ్లిపోయింది. సినిమా అయితే వారం రెండు వారాల్లోపే పాత చింతకాయ పచ్చడవుతోంది. ఆ వెంటనే ఓటీటీల్లోకి చేరిపోయి..

Rajeev Rayala

|

May 14, 2022 | 6:39 PM

ఫిల్మ్ ఇండస్ట్రీ ఫాస్ట్ ఫార్వడ్‌లోకి వెళ్లిపోయింది. సినిమా అయితే వారం రెండు వారాల్లోపే పాత చింతకాయ పచ్చడవుతోంది. ఆ వెంటనే ఓటీటీల్లోకి చేరిపోయి.. కామన్ మ్యాన్ పాకెట్‌లో స్ట్రీమ్ అవుతోంది. దీంతో మునుపటిలా సినిమా ఎన్ని ఇన్ని రోజులు ఆడింది. అన్ని రోజులు ఆడింది అన్న మాటే లేదు.. రికార్డు పోస్టర్లు అంతకంటే లేదు. అయితే తాజాగా ఆ పాత రోజులను మరో సారి గుర్తుకు తెచ్చింది జక్కన్న(Rajamouli) మాగ్నమ్ ఓపెస్ ట్రిపుల్ ఆర్( RRR). ఫాస్ట ఫార్వడ్‌ రోజుల్లో కూడా దాదాపు 500సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. జక్కన్న చెక్కిన ట్రిపుల్ ఆర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించిన విషయం తెలిసిందే.. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

ఎన్నో రికార్డులను విట్ నెస్ చేసిన ట్రిపుల్ ఆర్ మేకర్స్ . తాజాగా మరో రికార్డును క్రియేట్ చేశారు. రీసెంట్‌ డేస్‌లో దాదాపు 500 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమా గా ట్రిపుల్ ఆర్ నిలవడంతో.. ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ రికార్డు ప్రింట్ చేసిన పోస్టర్లను షేర్ చేసి..ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్‌ చేశారు. మరో సారి టాలీవుడ్ స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేశారు. ఇక థియేటర్లలో ట్రిపుల్ ఆర్ జోరు అలా తగ్గిందో లేదో.. ఇలా ఓటీటీలోకి దించేందుకు రెడీ అయిపోయారు జక్కన్న అండ్ టీం. రెడీ అవడమేకాదు మే 20 నుంచి జీ5లో సినిమా స్ట్రీమ్ అవనుందంటూ అనౌన్స్ చేశారు. ఓ ట్రైలర్ ను కూడా యూట్యూబ్‌లో వదిలారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను ఓటీటీలో చూద్దామా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. అటు చరణ్ శంకర్ సినిమాతో.. తారక్ కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Keerthy Suresh: కళావతి అందాలకు కల్లోలం అవుతున్న కుర్రకారు

Rukshar Dhillon: పాలరాతి శిల్పం లా మెరిసిపోతున్న రుక్సర్‌ ధిల్లాన్‌.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Bhanu Shree: భాను శ్రీ కొంటె చూపాలకు కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu