యంగ్ హీరో నిఖిల్(Nikhil Siddhartha)జోరు పెంచాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న నిఖిల్. ప్రస్తుతం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా.. అర్జున్ సురవరం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు నిఖిల్. ఇక ముందుగా ఓ అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సెన్సేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రాసిన స్టోరీతో హ్యాపెనింగ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు పై నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్(18 Pages). న్యూ యేజ్ లవ్ స్టోరీతో యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నారు.
అలాగే నిఖిల్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా కార్తికేయ 2. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంటగా నటిస్తుంది. . ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. నిఖిల్.. తాజాగా ‘కార్తికేయ 2’ డబ్బింగ్ ఫార్మాలిటీస్ ని ముగించాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా స్టూడియోలో నిఖిల్ డబ్బింగ్ చెబుతున్న ఓ పిక్ ని కూడా షేర్ చేశారు. కార్తికేయ 2 చిత్రాన్ని 2022 జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :