Krack: మరోసారి చిక్కుల్లో మాస్ మహారాజా సినిమా.. క్రాక్ సినిమా స్టోరీ నాదే అంటూ పోలీసులకు ఫిర్యాదు

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ క్రాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Krack: మరోసారి చిక్కుల్లో మాస్ మహారాజా సినిమా.. క్రాక్ సినిమా స్టోరీ నాదే అంటూ పోలీసులకు ఫిర్యాదు
Krack
Follow us

|

Updated on: May 14, 2022 | 7:46 PM

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja )నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ క్రాక్(Krack). గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న రవితేజకు క్రాక్ సినిమా సాలిడ్ సక్సెస్ ను అందించింది. మరోసారి పవర్ ఫుల్ పోలీసు పాత్రలో రవితేజ అదరగొట్టారు. ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమాతో  సూపర్ కం బ్యాక్ అందుకుంది శృతి. కరోనా కల్లోలం సమయంలో 2021 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా 50 శాతం ఆక్యుపెన్సీ తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. వస్తావా సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు గోపీచంద్ మలినేని. తాజాగా ఈ సినిమా పై పోలీసులకు ఫిర్యాదు అందింది.

క్రాక్ సినిమా కథ నాదే అంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ సినిమా కథ తనదే అంటూ సికింద్రాబాద్ లోని అల్వాల్ లో ఉండే శివ సుబ్రమణ్యమూర్తి అనే రచయిత హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ’ అనే పుస్తకంలో సన్నివేశాలను తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారని అతడు ఆరోపిస్తున్నాడు. ‘బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ’ అనే పుస్తకాన్ని రచించానని.. తన పుస్తకంలోని సన్నివేశాలను కాఫీ చేసి ‘క్రాక్’ సినిమాలో రూపొందించారని శివ సుబ్రమణ్యమూర్తి ఆరోపించారు. ఫిలిం ఛాంబర్ నుంచి నోటీసులు పంపించినా.. ఎవరూ స్పందించలేదని.. దీంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. గతంలోనూ క్రాక్ సినిమా పై పలు వివాదాలు తలెత్తాయి.. తనకు ఇవ్వాల్సిన రూ.12 లక్షల బ్యాలెన్స్ అమౌంట్ నిర్మాత ఠాగూర్ మధు ఇవ్వడం లేదంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఈ వ్యవహారం పై నిర్మాత, దర్శకుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Keerthy Suresh: కళావతి అందాలకు కల్లోలం అవుతున్న కుర్రకారు

Rukshar Dhillon: పాలరాతి శిల్పం లా మెరిసిపోతున్న రుక్సర్‌ ధిల్లాన్‌.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Bhanu Shree: భాను శ్రీ కొంటె చూపాలకు కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే