Prabhas: ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే న్యూస్.. జతకట్టే హీరోయిన్ ఎవరంటే?

Spirit: ప్రభాస్ ప్రస్తుతం 'ప్రాజెక్ట్ కె', 'సలార్'లను ముగించిన తర్వాత 'స్పిరిట్' సెట్స్‌పైకి రానున్న సంగతి తెలిసిందే.

Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' నుంచి అదిరిపోయే న్యూస్.. జతకట్టే హీరోయిన్ ఎవరంటే?
Prabhas Samdeep Vanga Spirt
Follow us
Venkata Chari

|

Updated on: May 14, 2022 | 10:06 AM

ఇటీవల పూజా హెగ్డేతో కలిసి ‘రాధే శ్యామ్’లో కనిపించిన ప్రభాస్(Prabhas).. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ‘ప్రాజెక్ట్ కె'(Project K) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అలాగే ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్'(spirit) అనే సినిమాలోనూ ప్రభాస్ నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి కీలక అప్ డేట్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ జోడీగా ఇద్దరు టాప్ హీరోయిన్లలో ఎవరిని ఫైనల్ చేయనున్నారో తెలియాల్సి ఉంది. కాగా, ఈ రాబోయే థ్రిల్లర్ డ్రామా ‘స్పిరిట్’లో రష్మిక మందన్న లేదా కియారా అద్వానీ జతకట్టనున్నారు.

Also Read: South Indian Heroes: మహేష్ నుంచి విజయ్ వరకు.. అత్యధిక రెమ్యునరేషన్లతో దూసుకెళ్తోన్న సౌత్ ఇండియన్ హీరోస్..

ఈ చిత్రంలో ప్రభాస్‌కి రష్మిక లేదా కియారా బాగా సరిపోతారని సందీప్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో వీరిలో ఒకరిని ఈ చిత్రం కోసం లాక్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే, సందీప్ వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ సినిమా కోసం రష్మికతో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆమెనే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు శంకర్ షణ్ముగం దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన కియారా నటించనుంది. ప్రభాస్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కె’, ‘సలార్’లను ముగించిన తర్వాత ‘స్పిరిట్’ సెట్స్‌పైకి రానున్న సంగతి తెలిసిందే.

Also Read: Vishnu Manchu: మంచు విష్ణు పై ఫైర్ అయిన మహేష్ ఫ్యాన్స్.. ఎందుకంటే ??

Richa Chadha: అందుకే సౌత్ లాభాల్లో ఉంది.. బాలీవుడ్‌ నష్టాలకు మాత్రం వాళ్లే కారణం: హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు