South Indian Heroes: మహేష్ నుంచి విజయ్ వరకు.. అత్యధిక రెమ్యునరేషన్లతో దూసుకెళ్తోన్న సౌత్ ఇండియన్ హీరోస్..

ట్రెండ్‌ను బట్టి చూస్తే, భారీ రెమ్యునరేషన్లు అనేది దక్షిణ భారతదేశంలో తాజా ట్రెండ్‌గా నిలిచింది. దక్షిణాదిలో అగ్రతారల రెమ్యునరేషన్ వివరాలు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..

South Indian Heroes: మహేష్ నుంచి  విజయ్ వరకు.. అత్యధిక రెమ్యునరేషన్లతో దూసుకెళ్తోన్న  సౌత్ ఇండియన్ హీరోస్..
Mahesh Babu Rajinikanth Prabhas
Follow us
Venkata Chari

|

Updated on: May 14, 2022 | 9:41 AM

ప్రపంచంలో మరెవరూ లేని విధంగా సౌత్ ఇండియన్(South Indian Heroes) నటీనటులు స్టార్ డమ్‌ని ఎంజాయ్ చేస్తారనడంలో సందేహం లేదు. వారి అభిమానులకు ఈ ఎంజాయ్‌మెంట్‌లో కీలకంగా ఉంటారనడంలో సందేహం లేదు. ఒక స్టార్ సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల ముందు సందడే సందడి. ఇదంతా ఒకవైపు అనుకుంటే, మరోవైపు స్టార్ హీరోల రెమ్యునరేషన్ల(Remuneration)ను చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే. అగ్రతారలు ఒక్కో సినిమాకి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ వసూలు చేస్తుంటుంటారు. ఈ లెక్కల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ, ఇక్కడ కూడా అభిమానుల మధ్య పోటీ నెలకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. ఏదీఏమైనా కొంతమంది స్టార్లు తీసుకుంటున్న రెమ్యునరేషన్లు మాత్రం నెట్టింట్లో తెగ సందడిచేస్తున్నాయి. వారు ఎవరు, ఒక్కోసినిమా(Movie)కు ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..

Also Read: Richa Chadha: అందుకే సౌత్ లాభాల్లో ఉంది.. బాలీవుడ్‌ నష్టాలకు మాత్రం వాళ్లే కారణం: హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు

విజయ్: తలపతి విజయ్ తన ఒక్కోసినిమాకు దాదాపు రూ.100 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మాస్టర్ కోసం రూ. 80 కోట్లు వసూలు చేశాడంట. ఆ సినమా అద్భుతమైన విజయం తర్వాత రెమ్యునరేషన్‌ను మరో రూ. 20 కోట్లు పెంచాడంట. మృగం పరాజయం తర్వాత, విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోయే సినిమా కోసం రూ. 118 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.

అజిత్ : విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన AK62 కోసం తల అజిత్ తన ఫీజుగా రూ. 100 కోట్లను తీసుకున్నాడంట. అయితే, ప్రొడక్షన్ హౌస్ ఒక అడుగు ముందుకేసి అజిత్ ప్యాకేజీగా రూ.105 కోట్లు ఇచ్చిందని చెబుతున్నారు.

రజనీకాంత్ : అత్యధిక రెమ్యునరేషన్ పొందిన తొలి భారతీయ నటుల్లో సూపర్ స్టార్ ఒకరు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఓ సినిమాకు రూ. 100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు.

మోహన్‌లాల్: మలయాళ సూపర్‌స్టార్ తన రెమ్యునరేషన్‌గా రూ. 64 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఇది మలయాళ సినిమా చరిత్రలో ఏ నటుడికీ లేని అత్యధికంగా నిలిచింది.

ప్రభాస్: బాహుబలి ఘనవిజయం తర్వాత, ప్రభాస్ మార్కెట్ ఎన్నో రెట్లు పెరిగింది. ఈ నటుడు ఒక్కో సినిమా కోసం రూ. 80-85 కోట్లు వసూలు చేస్తున్నాడని సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాహుబలికి ముందు అతను ఒక్కో సినిమాకు రూ. 8-10 కోట్లు వసూలు చేశాడు.

యష్: KGF స్టార్ రెండో పార్ట్ కోసం రూ. 20 కోట్లను తీసుకున్నాడు. కన్నడ సినిమాల్లో ఏ నటుడికైనా ఇదే అత్యధికంగా నిలిచింది. KGF 2 తర్వాత యష్ తన ఫీజును అనేక రెట్లు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మహేష్ బాబు: తెలుగు స్టార్ తన తాజా విడుదలైన సర్కారు వారి పాట కోసం రూ. 80 నుంచి రూ. 85 కోట్ల మధ్య వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది.

ఇక తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ రూ. 70 కోట్లు వసూలు చేయగా, తారక్ రూ. 50 కోట్లు తీసుకుంటున్నాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ ఒక్కో సినిమాకు రూ. 40 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. ట్రెండ్‌ను బట్టి చూస్తే, భారీ రెమ్యునరేషన్లు అనేది దక్షిణ భారతదేశంలో తాజా ట్రెండ్‌గా నిలిచింది.

Also Read: కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు

RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది