Nandu: ‘గీత అన్న ఆ మాటలను తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లాగవు’.. ఆ సంచలన ఆరోపణలపై స్పందించిన నందు
ప్రస్తుతం బుల్లితెరపైనే ఎక్కువగా కనిపిస్తున్నాడు హీరో నందు. ఓ ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షోకు యాంకర్ గా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. చాలా రోజుల తర్వాత నందు హీరోగా నటించిన చిత్రం 'సైక్ సిద్ధార్థ'. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడింది.

చాలా రోజుల తర్వాత మళ్లీ హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నందు. అతను నటించిన లేటెస్ట్ సినిమా ‘సైక్ సిద్దార్థ’. వరుణ్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీలో యామినీ భాస్కర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సింది. అయితే అదే సమయానికి బాలయ్య అఖండ 2 రిలీజ్ కావడంతో ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడింది. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 01న ‘సైక్ సిద్దార్థ’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటున్నాడు నందు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాను బలంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్నాడు. ఇదే సందర్భంగా తన వృత్తి, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. కాగా గతంలో నందు మీద పలు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడిదే విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడీ హీరీ.
‘అనవసరమైన అంశాల్లో నా పేరును చేర్చినప్పుడు ఎంతో బాధ పడ్డాను. నేను ఈ సినిమా ఫీల్డ్‌లో లేకపోతే నామీద అలాంటి రూమర్స్ వచ్చే అవకాశమే ఉండేది కాదు. చూసేవాళ్లు మన గురించి ఎన్నో అనుకుంటారు. కానీ, వాళ్లెవరికీ దీని వెనక ఏం జరుగుతుంది, ఎన్ని గేమ్స్ ఉంటాయి, మనల్ని ఎలా ఇరికిస్తారు.. వంటి విషయాలు అసలు అర్థం కావు. సినిమా ఇండస్ట్రీలో మనకు బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మనం ఏం చేయలేమనుకుంటారు. అందుకే సంబంధం లేని అంశాల్లో మన పేర్లను చేరుస్తారు. నేను చేయని పనికి నామీద ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో నాతో పాటు నా కుటుంబం మొత్తం బాధ పడింది. ఆ సమయంలో నా బాధ చూసి గీత నాతో చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ‘ మనం ఇక్కడ ఉండలేం. అన్నీ వదిలేసి వేరే దేశానికి వెళ్లిదాం. అక్కడ ఏదైనా హోటల్లో పని చేసుకునైనా బతుకుదామంది. ఆ మాటలు గుర్తుచేసుకుంటే ఇప్పటికీ నా కళ్లల్లో నీళ్లు ఆగవు’ అని ఎమోషనల్ అయ్యాడు నందు. ప్రస్తుతం ఈ హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
భార్య, పిల్లలతో హీరో నందు..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




