Tollywood: రెండోసారి తల్లికాబోతున్న టాలీవుడ్ నటి.. ఎవరో గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే సంచలనం
కొందరు తక్కువ సినిమాల్లో నటించినా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. తమ అందం, అభినయంతో ఆడియెన్స్ మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంటారు. ఈ టాలీవుడ్ నటి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ బ్యూటీ నటించింది తక్కువ సినిమాలే అయినా కానీ బాగా ఫేమస్ అయ్యింది.

దీపావళి పండగను పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖ నటి గుడ్ న్యూస్ చెప్పింది. తాను రెండోసారి తల్లికాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు, సి నీ అభిమానులు, నెటిజన్లు ఈ నటికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఇంతకీ పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? 2002లో తేజ తెరకెక్కిన ప్రేమకథా చిత్రం జయం. ఇందులో నితిన్, సదా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇద్దరికి మొదటి సినిమానే అయినా అద్భుతంగా నటించారు. మూవీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే జయం సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నటించారు. గోపీచంద్ విలన్ గా ఆకట్టుకున్నాడు. శివకృష్ణ, ప్రసాద్ బాబు, ధర్మవరపు సుబ్రమణ్యం, సుమన్ శెట్టి, రాళ్ల పల్లి, దువ్వాసి మోహన్ ఇలా చాలామంది నటులు కనిపించారు. అలాగే హీరోయిన్ సదా చెల్లెలిగా ఒక ఛైల్డ్ ఆర్టిస్ట్ కూడా అద్బుతంగా నటించింది. సినిమాలో తన నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ ఛైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు సీరియల్, సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న జయలక్ష‍్మి కూతురే. తన పేరు యామిని శ్వేత.
‘జయం’ సినిమాలో నటించడాని కంటే ముందు చాలా సీరియల్స్‌లో నటించింది యామిని. ఈ క్రేజ్ తోనే జయం సినిమాకు ఎంపికైంది. తన నటనకు ఏకంగా నంది అవార్డు కూడా అందుకుంది. అయితే దీని తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదీ అందాల తార. ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు తదితర సినిమాలు చేసిన తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి సారించింది. విదేశాల్లో మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని విదేశాల్లోనే సెటిలైపోయింది. కొన్నేళ్ల క్రితం ఈ దంపతులకు ఒక కూతురు ఉంది. ఇప్పుడు మరోసారి గర్భం ధరించినట్లు శుభవార్త చెప్పింది.
బేబీ బంప్ తో యామినీ శ్వేత..
View this post on Instagram
దీపావళి సందర్భంగా ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టిన యామినీ.. తన ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేసుకుంది.ముగ్గురుగా ఉన్న తన కుటుంబం త్వరలోనే నలుగురిగా మారనుందని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. అలానే బేబీ బంప్ ఫొటోని కూడా షేర్ చేసింది.
అప్పట్లో జయం సినిమాలో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








