ఏ సౌండ్‌కు నవ్వుతానో.. ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలియదు.. ఇరగదీసిన బాలయ్య
గతేడాది బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలతో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ షేక్ చేశారు బాలయ్య. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, మహారాజ్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు.

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు బాలయ్య. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికీ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు బాలయ్య. ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ.. నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు నటసింహం. ఇటీవల వరుసగా 4 సినిమాలతో రూ.100 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డ్ సైతం స్వీకరించారు.
ఒకే ఒక్క బిస్కెట్ యాడ్ జీవితాన్నే మార్చేసింది.. కట్ చేస్తే 260కు పైగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్
ప్రస్తుతం అఖండ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు బాలయ్య. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది, ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. సింహ, లెజెండ్, అఖండ ఈ మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. ఇక ఇప్పుడు అఖండ 2 సినిమాతో రాబోతున్నారు బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా మరో వీడియో విడుదల చేశారు.
ప్రభాస్‌కు అమ్మగా, గోపిచంద్‌కు వదినగా చేసింది.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
బ్లాస్టింగ్ రోర్ అంటూ మరో గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ వీడియోలో బాలయ్య అదిరిపోయే డైలాగ్ తో ఆకట్టుకున్నారు. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో.. ఏ సౌండ్ కు నవ్వుతానో ఏ సౌండుకు నరుకుతానో నాకే తెలియదు కొ*డకా.. ఊహకు కూడా అందదు” అంటి ఇరగదీశారు బాలకృష్ణ. ఈ వీడియో ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దాంతో సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇక అఖండ 2 సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
బుర్రపాడు సిరీస్ రా బాబు..! మిస్టరీ గదిలో పిచ్చెక్కించే అమ్మాయిలు..!!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








