Jani Master: పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన జానీ మాస్టర్.. ఆ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి..
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. బుధవారం (జనవరి 24) మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు.
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. బుధవారం (జనవరి 24) మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టర్ గత కొన్నిరోజులుగా అక్కడే విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాడు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే తానెంతో అభిమానించే పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరారు. త్వరలో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ జానీ మాస్టర్ పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి ఈ స్టార్ కొరియోగ్రాఫర్ బరిలోకి దిగనున్నాడని ప్రచారం సాగుతోంది.
టాలీవుడ్‌లో స్వయంకృషితో ఎదిగిన అతి కొద్ది మంది కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ కూడా ఒకరు. 2009 నితిన్ ద్రోణ సినిమాతో డ్యాన్స్‌మాస్టర్‌గా అడుగుపెట్టారాయన. రామ్ చరణ్‌తో రచ్చ, నాయక్, ఎవడు, రంగస్థలం, అల్లు అర్జున్‌తో జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసు గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠ పురంలో, యంగ్ టైగర్‌తో ఎన్టీఆర్‌తో బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో అరవింద సమేత వీర రాఘవ, రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. తమిళంలో విజయ్, కన్నడలో సుదీప్ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన ఆయన బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ తదితర స్టార్ హీరోలతోనూ వర్క్ చేశారు.
జనసేనలో చేరుతున్న జానీ మాస్టర్..
ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్ @AlwaysJani బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. pic.twitter.com/UWwK3USuYO
— JanaSena Party (@JanaSenaParty) January 24, 2024
కండువా కప్పి జానీ మాస్టర్ ను ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్ @AlwaysJani బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. pic.twitter.com/x1ssPyHnjz
— JanaSena Party (@JanaSenaParty) January 24, 2024
నెల్లూరు జిల్లాలో జానీ మాస్టర్..
View this post on Instagram
మదరసాలకు ఆర్థిక సహాయం..
View this post on Instagram
మరోవైపు పవన్ కల్యాణ్ తో కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి సీటును ఆశ్రయిస్తున్నారు . టికెట్‌పై హామీ ఇస్తే జనసేనలో.. లేదంటే కొణతాల కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మంగళవారం ఆయన వైఎస్ షర్మిలను కలవడం గమనార్హం.
నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ఎమ్మెల్యే వైసీపీ వరప్రసాద్ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసుకు వచ్చారు.
పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. గత కొంత కాలంగా వైసిపిపై అసంతృప్తితో ఉన్న వర ప్రసాద్ తిరుపతి ఎంపి సీటు ఆశిస్తున్నారు. 2014లో తిరుపతి ఎంపీగా,2019లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.