Allu Arjun: తండ్రిని కోల్పోయిన బాధ నుంచి తేరుకోని ‘బేబీ’ నిర్మాత.. ఇంటికెళ్లి ధైర్యం చెప్పిన అల్లు అర్జున్
తండ్రిని కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదు నిర్మాత ఎస్‌కే ఎన్. గత కొన్ని రోజులుగా పెద్దగా బయట కనిపించడం లేదాయన. ఈ నేపథ్యంలో శ్రీనివాస కుమార్‌కు అత్యంత సన్నిహితుడైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్మాత ఇంటికి వెళ్లి పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఎస్‌కేఎన్ నివాసానికి వెళ్లి ఆయనకు ధైర్యం చెప్పారు
బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్ అలియాస్ శ్రీనివాస కుమార్ ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి గాదే సూర్య ప్రకాశ రావు జూన్ 4న కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడవడంతో ఎస్‌కేఎన్ సహా ఆయన కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు, మెగాభిమానులు ఎస్‌కేఎన్ ఫ్యామిలీకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తండ్రిని కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదు నిర్మాత ఎస్‌కే ఎన్. గత కొన్ని రోజులుగా పెద్దగా బయట కనిపించడం లేదాయన. ఈ నేపథ్యంలో శ్రీనివాస కుమార్‌కు అత్యంత సన్నిహితుడైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్మాత ఇంటికి వెళ్లి పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఎస్‌కేఎన్ నివాసానికి వెళ్లి ఆయనకు ధైర్యం చెప్పారు. ఎస్‌కేఎన్ న తండ్రి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌కేఎన్‌తో చాలా సేపు మాట్లాడారు అల్లు అర్జున్.
కష్ట సమయంలో బన్నీ తన ఇంటికి రావడంతో నిర్మాత ఎస్‌కేఎస్ ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రికి అల్లు అర్జున్ నివాళులు అర్పిస్తున్న ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆయన ‘ ఇలాంటి కష్ట సమయంలో నా ఇంటికి వచ్చి.. నాకు ధైర్యం చెప్పినందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు. నేను ఎంతగానో అభిమానించే బన్నీ నా ఇంటికి రావడం చాలా ఓదార్పునిచ్చింది’ అని ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే శ్రీనివాస కుమార్ మెగా ఫ్యామిలీకి బాగా సన్నిహితుడు. చిరంజీవి వీరాభిమానిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారాయన. సాధారణ డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలెట్టి, పీఆర్‌వోగా, ఆపై నిర్మాతగా మారారు. గతేడాది బేబీ సినిమాతో ఎస్‌కేఎన్ పేరు బాగా మార్మోగిపోయింది.
నిర్మాత ఎస్ కే ఎన్ తో అల్లు అర్జున్..
I am immensely grateful to my dear Icon star @alluarjun garu for his heartfelt visit to my home during this difficult time. His presence and condolences for my father’s passing mean the world to me. Thank you for your kindness, support 🙏🏻 pic.twitter.com/Z4yHIRAwWR
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) January 23, 2024
పవన్ కల్యాణ్ సంతాపం..
Dad is Hero to any one I lost my hero. He has seen my biggest success of #Babythemovie but still I am speechless, broken & feeling like I lost my world Thank u @PawanKalyan garu for ur heartfelt message & Aravind sir Sirish for backing me when I am broke down. From today the… pic.twitter.com/0FqVxv3m87
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) January 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.