Fighter Banned: రిలీజ్‌కు ముందు బిగ్ సాక్.! ఫైటర్ పై బ్యాన్ అస్త్రం.. ఎక్కడంటే.?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తోన్న సినిమా ఫైటర్. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. ఇందులో అక్షయ్ ఒబెరాయ్, అనిల్ కపూర్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ హైప్ పెంచాయి. ఇక ఈ సినిమా జనవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. కానీ ఈ క్రమంలోనే ఈ సినిమా టీంకు షాక్ తగిలింది.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తోన్న సినిమా ఫైటర్. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. ఇందులో అక్షయ్ ఒబెరాయ్, అనిల్ కపూర్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ హైప్ పెంచాయి. ఇక ఈ సినిమా జనవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. కానీ ఈ క్రమంలోనే ఈ సినిమా టీంకు షాక్ తగిలింది. భారతీయ వైమానిక దళ అధికారుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ తెచ్చుకుంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌కు కూడా మంచి రెస్పాన్సే వస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రీమియర్ టికెట్స్ అత్యధికంగా అమ్ముడయ్యాయి కూడా..! కానీ బాలీవుడ్ సినిమాలకు వన్ ఆఫ్ ది బిగ్ మార్కెట్ అయిన గల్ఫ్ దేశాల్లో మాత్రం ఈ మూవీ.. బ్యాన్ అయిపోయింది. UAE మినహా దాదాపు గల్ఫ్ దేశాలన్నింట్లోనూ ఫైటర్ చిత్రంపై నిషేధం విధించారు అక్కడి ప్రభుత్వ నేతలు. సాధారణంగా తీవ్రవాదం లేదా భారత్ పాకిస్తాన్ వివాదల లాంటి అంశాలతో తెరకెక్కించిన సినిమాలను గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేస్తుంటారు. ఫైటర్ సినిమా కూడా.. ఇలాంటి కథాంశంతో తెరకెక్కడంతో… ఈ సినిమాను కూడా అక్కడ బ్యాన్ చేసినట్టు న్యూస్. అయితే ఈ బ్యాన్ ఖచ్చితంగా… ఈ మూవీ కలెక్షన్స్‌ను ఎఫెక్ట్ చూపిస్తుందని.. బాలీవుడ్ ట్రెడ్ వర్గాల కామెంట్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

