AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప 2కు సపోర్ట్‌గా జాన్వీ కపూర్.. నెటిజన్స్‌కు దిమ్మతిరిగే కౌటర్ ఇచ్చిన బ్యూటీ

అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తుంది. తొలి షో నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక అన్ని భాషల్లో పుష్ప 2 సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అలాగే సినిమా కలెక్షన్లుకూడా బాగానే వస్తున్నాయి. ఇండియాతో పాటు విదేశాల్లో కూడా పుష్ప2 సత్తా చూపిస్తుంది.

Pushpa 2: పుష్ప 2కు సపోర్ట్‌గా జాన్వీ కపూర్.. నెటిజన్స్‌కు దిమ్మతిరిగే కౌటర్ ఇచ్చిన బ్యూటీ
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: Dec 07, 2024 | 12:00 PM

Share

పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది పుష్ప 2 చరిత్రలో మరే సినిమా చేయని విధంగా థియేటర్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా విడుదలై కేవలం 2 రోజులే అవుతుంది.. ఈ రెండు రోజుల్లోనే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. పుష్ప2 సినిమా ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ. 400 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పటికే మొదటి రోజు కలెక్షన్స్ తో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్.. రికార్డులన్నీ బ్రేక్ చేసింది.

కోతి కొమ్మచ్చి ఆడుతున్న ఈ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. అమ్మాయిలు వెర్రెక్కిపోతారు అతనంటే.. 

పుష్ప2 చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 275.20 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. దీని తర్వాత ఈ చిత్రం రెండవ రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా తన జోరును కొనసాగించింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ 400 కోట్లు దాటేసింది. ఇక ఈ సినిమా పై కొందరు పనిగట్టుకొని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వారికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది అందాల భామ జాన్వీ కపూర్.

Tollywood : నా బాడీ నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.. తెగేసి చెప్పిన టాలీవుడ్ సింగర్

‘పుష్ప2’ సినిమా రిలీజ్ కారణంగా.. హాలీవుడ్‌ సూపర్ హిట్ మూవీ ఇంటర్‌స్టెల్లార్‌ రీ రిలీజ్‌ వాయిదా పడిందని విమర్శిస్తూ కొంతమంది నెటిజన్స్  పోస్ట్‌లు పెడుతున్నారు. ఇంటర్‌స్టెల్లార్‌ విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా ఆ సినిమాను రీ రిలీజ్ చేయాలనీ భావించారు. అయితే ఇప్పుడు ఇండియాలో ఎక్కువ థియేటర్స్ లో పుష్ప 2 సందడి చేయడంతో ఇంటర్‌స్టెల్లార్‌ సినిమాను ఇండియాలో వాయిదా వేయాలని అనుకుంటున్నారు. దాంతో పుష్ప సినిమాను విమర్శిస్తూ కొందరు పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా దీనికి జాన్వీ కపూర్ కౌంటర్ ఇచ్చింది. “పుష్ప సినిమాను మరో సినిమాతో ఎందుకు పోల్చుతున్నారు. హాలీవుడ్ సినిమాలు మన సినిమాల పై ప్రశంసలు కురిపిస్తుంటే.. మనం మాత్రం ఇలా మన సినిమాలను తక్కువ చేసి కామెంట్స్ చేస్తున్నాం. మన సినిమాలను మనల్ని మనమే అవమానించుకుంటూ ఉండిపోతున్నాం. ఇలాంటివి చూసినప్పుడు బాధగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.