AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: సిరిసిల్ల చేనేత మగ్గంపై జనసేనాని దుస్తులు.. పవన్ అభిమాని చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే

హరిప్రసాద్ చేనేత మగ్గంపై పవన్ కళ్యాణ్ చిత్రమున్న జ్ఞాపికను తయారు చేసిన కలను చూసిన అమెరికాలోని అట్లాంటా ప్రాంతానికి చెందిన పవన్ అభిమాని హరి ప్రసాద్ చేస్తున్న అద్భుతాలను యూట్యూబ్ లో చూసి సుమారు 6 లక్షల రూపాయల విలువగల వస్త్రాలను చేనేత మగ్గంపై తయారు చేయాలని హరి ప్రసాద్ ఫోన్ లో సంప్రదించి మాట్లాడి ఆర్డర్ ఇచ్చాడు.

Pawan Kalyan: సిరిసిల్ల చేనేత మగ్గంపై జనసేనాని దుస్తులు.. పవన్ అభిమాని చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే
Pawankalyan
G Sampath Kumar
| Edited By: Rajeev Rayala|

Updated on: Aug 05, 2024 | 10:27 AM

Share

సిరిసిల్ల చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుస్తులు చేనేత మగ్గంపై నేశాడు. సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ కు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నిత్యం ధరించే గుడ్డను తయారు చేసే అరుదైన అవకాశం లభించించడంతో హరి ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశాడు. గతంలో హరిప్రసాద్ చేనేత మగ్గంపై పవన్ కళ్యాణ్ చిత్రమున్న జ్ఞాపికను తయారు చేసిన కలను చూసిన అమెరికాలోని అట్లాంటా ప్రాంతానికి చెందిన పవన్ అభిమాని హరి ప్రసాద్ చేస్తున్న అద్భుతాలను యూట్యూబ్ లో చూసి సుమారు 6 లక్షల రూపాయల విలువగల వస్త్రాలను చేనేత మగ్గంపై తయారు చేయాలని హరి ప్రసాద్ ఫోన్ లో సంప్రదించి మాట్లాడి ఆర్డర్ ఇచ్చాడు.

ఆర్డర్ తీసుకున్న హరిప్రసాద్ దంపతులు దాదాపు 25 రోజులు శ్రమించి పవన్ కళ్యాణ్ ధరించే వస్త్రాలను తయారుచేశారు. పవన్ ధరించే చొక్కాపై జనసేన పార్టీ లోగో వచ్చేలా తయారు చేయడానికి ఆయనకు ఐదు రోజుల సమయం పట్టింది. లోగో తయారీకి ఎరుపు, నలుపు రంగుల పట్టు దారం ఉపయోగించి, పూర్తిగా చేతులతో మాగ్గంపై  నేశాడు. 100 నెంబర్ కాటన్, లెనిన్ దారం లాడీలను ఉపయోగించి, పేక మాలును రాత్నం ఊసేలపై చుట్టిన కండలతో తయారు చేసిన దారాలతో హరిప్రసాద్ మగ్గంపై వస్త్రాన్ని నేశాడు. ఒక చొక్కా తయారీకి మూడు మీటర్లు, ప్యాంటు తయారీకి రెండు మీటర్ల వస్త్రం ఉపయోగించాడు. హరి ప్రసాద్ ప్రతి ఏటా చేనేత దినోత్సవానికి ఏదో విధంగా తన కలను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సంవత్సరం సిరిసిల్లలోనే మొట్టమొదటిసారిగా చేనేత మగ్గంపై లెనిన్ వస్త్రాల ఉత్పత్తి చేసాడు హరిప్రసాద్ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.  తనకు ఆర్డర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. అవకాశం ఇస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు చేనేత మగ్గంపై సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

అంతటితో ఆగకుండా దేశంలో ఉన్న ప్రముఖ దేశ, విదేశాల ప్రాధానుల నేతల ముఖచిత్రాలు, న్యూజిలాండ్ ప్రధానమంత్రి ముఖచిత్రం వేసి ఆ ప్రధానికి పంపించాడు.  భారత రత్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ భార్య అంజలి ఫోటోలు మగ్గం పై నేసి అందించాడు. మొన్న దేశంలో జరిగిన జి20 సదస్సు లోగో నేసి భారత ప్రాధాన మంత్రి నరేంద్ర మోడీకి అందించి మన్నలను పొందాడు. 95 ఏపిసోడ్ మన్ కి బాత్ లో హరి ప్రసాద్ నేసిన చేనేత ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎప్పుడు ఎదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు.  బుల్లి మర మగ్గం  తయారు చేసి దానిపై వస్త్రాన్ని వేసి అందరినీ ఆశ్చర్యపడేలా చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.