Rithu Chowdary: ‘జబర్దస్త్’ కారు కొన్న యాంకర్ రీతూ చౌదరి.. అమ్మతో కలిసి ఫస్ట్ డ్రైవ్.. ఇంతకీ ధరెంతో తెలుసా?
జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. చిన్న చిన్న ఇంటర్వ్యూలతో కెరీర్ ప్రారంభించిన ఈ యాంకరమ్మ కొన్ని సీరియల్స్ కూడా చేసింది. ఇంటిగుట్టు, అమ్మకోసం, గోరింటాకు, సూర్యవంశం ఇలా అనేక సీరియల్స్‌లో నటించింది రీతూ. అయితే జబర్దస్త్ షో ద్వారానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. తన అమాయకపు నటన, పంచులతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించింది.

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. చిన్న చిన్న ఇంటర్వ్యూలతో కెరీర్ ప్రారంభించిన ఈ యాంకరమ్మ కొన్ని సీరియల్స్ కూడా చేసింది. ఇంటిగుట్టు, అమ్మకోసం, గోరింటాకు, సూర్యవంశం ఇలా అనేక సీరియల్స్‌లో నటించింది రీతూ. అయితే జబర్దస్త్ షో ద్వారానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. తన అమాయకపు నటన, పంచులతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించింది. ప్రస్తుతం దావత్ అనే టాక్ తో బాగా పాపులర్ అవుతోందీ అందాల తార. ఈ కార్యక్రమానికి వచ్చే గెస్టులను బోల్డ్ ప్రశ్నలు వేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు బోలెడు ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం యాంకర్‌గానూ, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గానూ దూసుకుపోతోన్న రీతూ చౌదరి తాజాగా ఒక లగ్జరీ కారు కొంది. కారును డెలివరీ తీసుకోవడం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం, అమ్మతో కలిసి ఫస్ట్ డ్రైవ్ చేయడం తదితర కార్యక్రమాలకు సంబంధించిన విజువల్స్ అన్నింటినీ ఒక వీడియో రూపంలో రిలీజ్ చేసిందీ అందాల యాంకరమ్మ. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రీతూ స్నేహితులు, బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు రీతూకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.
రీతు క్లోజ్ ఫ్రెండ్ విష్ణు ప్రియ హార్ట్ సింబల్స్ పెట్టడం మాత్రమే కాకుండా.. దిష్టి తగలకూడదంటూ ఎమోజీలు షేర్ చేసింది. అలాగే ఇనయా సుల్తానా, దివి వంటి వారు కూడా యాంకరమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక రీతూ చౌదరి కొత్తగా కొన్న లగ్జరీ కారు పేరు ఇన్నోవా క్రిస్టా హైబ్రిడ్ హైక్రాస్. ప్రస్తుతం సెలబ్రిటీలందరూ ఈ కారునే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ లగ్జరీ కారు ధర విషయానికి వస్తే.. బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.24.64 లక్షలుగా ఉంది. ఇందులోనే హైఎండ్ మోడల్ ధర ఎక్స్ షోరూమ్ రూ.38.66 లక్షలుగా ఉంది. ఇక ఇన్నోవా క్రిస్టా హైక్రాస్ జెడ్ఎక్స్(ఓ) హైబ్రిడ్ టాప్ మోడల్ ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ.45 లక్షల వరకు ఉంటుంది. ఈ లెక్కన చూస్తే రీతు చౌదరి లగ్జరీ కారు కొన్నట్లే.
కొత్త కారులో జబర్దస్త్ రీతు చౌదరి.. వీడియో ఇదిగో..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




