AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alka Yagni: అదే పనిగా ఇయర్ బడ్స్ పెట్టుకుంటున్నారా..? ఆ సింగర్‌లాగే మీకూ అరుదైన వ్యాధి

చెవులు పగులుతాయ్‌ జాగ్రత్త. ఇది నేను చెప్పట్లేదు... ప్రముఖ బాలీవుడ్‌ సింగర్ అల్కా యాజ్నిక్‌ చెబుతున్నారు. అరుదైన వ్యాధితో వినికిడి కోల్పోయిన ఆమె... ఎక్కువగా ఇయర్‌ బడ్స్‌ పెట్టుకోవద్దు, లౌడ్‌ సౌండ్‌ జోలికి వెళ్లొద్దని సలహా ఇవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె సమస్య విన్నాక... హెడ్‌సెట్‌, ఇయర్‌ఫోన్స్‌, బ్లూటూత్‌ని చూస్తే భయం కలగడం పక్కా...

Alka Yagni: అదే పనిగా ఇయర్ బడ్స్ పెట్టుకుంటున్నారా..? ఆ సింగర్‌లాగే మీకూ అరుదైన వ్యాధి
Alka Yagnik
Ram Naramaneni
|

Updated on: Jun 19, 2024 | 7:20 AM

Share

అల్కా యాజ్నిక్… మనకు ఈపేరు పెద్దగా తెలియకపోవచ్చుగానీ, బాలీవుడ్‌లో ఫుల్‌ ఫేమస్. 25 భాషల్లో 21 వేలకు పైగా పాటలు… ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు. మరీ ముఖ్యంగా నైంటీస్‌లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. అలాగే 2022లో మోస్ట్ స్ట్రీమ్డ్‌ ఆర్టిస్ట్‌గా గిన్నీస్‌ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ స్టార్‌ సింగర్‌ ఇప్పుడు అరుదైన వ్యాధితో వినికిడి కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు… హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌బడ్స్‌ వాడకంపై ఆందోళన మొదలైంది.

న్యూరల్ నెర్వ్ సెన్సోరీ లాస్ అనే అరుదైన సమస్య బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు అల్కా యాజ్నిక్. ఈ వ్యాధి వల్ల ఏకంగా వినికిడి కోల్పోయినట్లు వెల్లడించారామె. కొన్ని వారాల క్రితం విమానం దిగి వస్తుంటే తనకేం వినబడలేదని… ఒక్కసారిగా రెండు చెవులు వినపడకపోవడంతో డాక్టర్లను సంప్రదిస్తే న్యూరల్‌ నెర్వ్‌ సెన్సోరీ లాస్‌ అనే అరుదైన వ్యాధి బారిన పడినట్లు తెలిపారని ఎమోషనల్‌ అయ్యారు అల్కా. అంతేకాదు… పెద్ద సౌండ్‌తో పాటలు వినడం, హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడటం తగ్గించాలని అందరికీ సలహా ఇస్తున్నారు.

ఇక అల్కా యాజ్నిక్‌ బెస్ట్‌ ఫీమేల్‌ ప్లేబాక్‌ సింగర్‌గా రికార్డు స్థాయిలో ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు జాతీయ చలనచిత్ర అవార్డులను కైవసం చేసుకున్నారు. గుజరాతీ కుటుంబంలో జన్మించిన అల్కా యాగ్నిక్… ఆరేళ్ల వయసులోనే పాడడం మొదలుపెట్టారు. 10 సంవత్సరాల వయస్సులో ముంబైకి వచ్చి తన సినీ జీవితాన్ని స్టార్‌ చేశారామె. ఆమె పాటలకు పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. దీంతో ఆమె తర్వగా కోలుకోవాలని, వినికిడి సమస్య పోవాలని ప్రార్థనలు చేస్తున్నారు అభిమానులు.

మొత్తంగా… అల్కా యాజ్నిక్‌ ఎదుర్కొంటున్న అరుదైన సమస్య, అందరిని ఒకింత భయానికి గురిచేస్తోంది. పరిధికి మించి సౌండ్‌ చెవుల్ని తాకితే చెవుడేనా…? ఎక్కువగా హెడ్‌ఫోన్స్‌ పెట్టుకోవడం, ఇయర్‌ బడ్స్‌తో లౌడ్‌ సౌండ్‌ వినడం వల్లే ఈ సమస్య వస్తుందా…? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు… న్యూరల్‌ నెర్వ్‌ సెన్సోరీ లాస్‌పై పెద్ద ఎత్తున రీసెర్చ్‌ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us