Raghava Lawrence: లారెన్స్ అడుగు జాడల్లో మరో స్టార్ యాక్టర్.. పేద రైతులకు ట్రాక్టర్లు అందజేత.. వీడియో
కోలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఈ మధ్యన సినిమాల కంటే సమాజసేవలోనే ఎక్కువగా బిజిబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే తన ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పేద పిల్లలకు ఉచితంగా వైద్యం, వసతి, ఆహారం సమకూరుస్తోన్న ఆయన ఇప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం నడుం బిగించారు.

కోలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఈ మధ్యన సినిమాల కంటే సమాజసేవలోనే ఎక్కువగా బిజిబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే తన ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పేద పిల్లలకు ఉచితంగా వైద్యం, వసతి, ఆహారం సమకూరుస్తోన్న ఆయన ఇప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం నడుం బిగించారు. ఇందులో భాగంగా పేద రైతులు, కూలీలకు తన వంతు సహాయం అందజేస్తున్నారు. మాత్రమ్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే పలువురు పేద రైతులకు ట్రాక్టర్లు అందజేశారు రాఘవ లారెన్స్. అలాగే దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, మహిళలకు కుట్టు మిషన్లు అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. కాగా గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే పది మంది పేద రైతులకు ట్రాక్టర్లు అందించారు రాఘవ లారెన్స్. ఈయన సాయం చూసి మరో స్టార్ నటుడు పేద రైతులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. లారెన్స్ తరహాలోనే అన్నదాతలకు ట్రాక్టర్లు అందజేసేందుకు రెడీ అయ్యారు. ఆయనెవరో కాదు జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో రాఘవ లారెన్స్ తో కలిసి నటించిన నటుడు, డైరెక్టర్ ఎస్ జే సూర్య.
తాజాగా తన సొంత డబ్బులతో ట్రాక్టర్ కొనుగోలు చేసిన ఎస్ జే సూర్య దానిని కాంచీపురం జిల్లాకు చెందిన బద్రీకి అందజేశారు. ఈ విషయాన్ని రాఘవ లారెన్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ జే సూర్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడీ రియల్ హీరో. ఇప్పుడు లారెన్స్, ఎస్ జే సూర్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.లారెన్స్ తో పాటు ఎస్ జే సూర్యపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరిని చూసి మరికొందరు స్టార్ హీరోలు సాయం చేసేందుకు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నారు.
పేద రైతుకు ట్రాక్టర్ అందజేస్తోన్న డైరెక్టర్ ఎస్ జే సూర్య, వీడియో ఇదిగో..
Hi Friends and fans, You are all aware that I handed over 10 Tractors to Farmers through the Maatram Foundation with my own money. Today @iam_SJSuryah Brother gave me a pleasant surprise by adding another Tractor with his own money. Together, We handed over the 11th Tractor to… pic.twitter.com/Bwe6sjyET5
— Raghava Lawrence (@offl_Lawrence) June 18, 2024
తాను చదివించిన పిల్లలతో రాఘవ లారెన్స్.. వీడియో
The seeds I planted 20 years ago have now grown into these beautiful souls and are being a good example in society. I’m extremely proud of my boys and girls for the kind of persons they have grown into. My heart is so full after spending some beautiful and quality time with them.… pic.twitter.com/XjytGqj2OW
— Raghava Lawrence (@offl_Lawrence) May 19, 2024
రైతుకు ట్రాక్టర్ అంజేస్తున్న రాఘవ లారెన్స్.. వీడియో
Hi friends and fans! I am excited to announce that Maatram’s service begun today. As I mentioned in our press meet, we will be presenting 10 tractors to financially struggling farmers. Our first tractor was presented to RajaKannan family from Vilupuram District, who is now solely… pic.twitter.com/7XePCpNweb
— Raghava Lawrence (@offl_Lawrence) May 1, 2024
దివ్యాంగులకు త్రీ వీలర్ బైక్స్ పంపిణీ.. వీడియో..
Hi friends and fans! I am proud to introduce my special boys, who have undergone physical challenges, to you all. This tradition is called Mallakhamba and they are incredibly talented. I humbly request you all to consider booking them for your events, shows, and functions using… pic.twitter.com/AUu0EzfUQ3
— Raghava Lawrence (@offl_Lawrence) April 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




