AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajashekhar: రాజశేఖర్ కూతురుగా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పటికీ అదే అందం..

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ మొత్తం సినిమా కెరీర్ లో 80 కు పైగా చిత్రాల్లో నటించారు. అలాగే ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే వీరిలో ఒకే ఒక్క హీరోయిన్ మాత్రం రాజశేఖర్ కు కూతురిగా, లవర్ గా నటించింది. ఆమె ఎవరో తెలుసా?

Rajashekhar: రాజశేఖర్ కూతురుగా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పటికీ అదే అందం..
Rajashekhar
Basha Shek
|

Updated on: May 19, 2026 | 4:22 PM

Share

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఇటీవలే బైకర్ సినిమాలో నటించారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ కథానాయకుడికి తండ్రిగా, కోచ్ గా బుల్లెట్ సునీల్ నారాయణ్ పాత్రలో అదరగొట్టారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రాజశేఖర్ నటన కన్నీళ్లు తెప్పించిందని చెప్పవచ్చు. అంతకు ముందు నితిన్ ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ సినిమాలోనూ ఓ కీ రోల్ పోషించారీ యాంగ్రీమ్యాన్. ఇక ప్రస్తుతం సహాయక నటుడిగా మెప్పిస్తోన్న రాజశేఖర్ ఒకప్పుడు హీరోగా టాలీవుడ్ లో చక్రం తిప్పారు. యాంగ్రీమ్యాన్ పేరుకు తగ్గట్టుగానే పవర్ ఫుల్ పాత్రలతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ హీరోలకు గట్టి పోటీనిచ్చారు. ఇప్పటివరకు సుమారు 80కు పైగా సినిమాల్లో నటించారు రాజశేఖర్. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోయిన్లతో కలిసి యాక్ట్ చేశారాయన. అయితే ఒక హీరోయిన్ మాత్రం రాజశేఖర్ కు కూతురుగా, ప్రియురాలిగా రెండు వేరు వేరు సందర్భాల్లో నటించింది. ఆమె మరెవరో కాదు అందాల రాశి.

ఛైల్డ్ ఆర్టిస్టుగా చేసి హీరోయిన్ గా మారిన వారిలో రాశి ఒకరు. కెరీర్ ప్రారంభంలోనే ఆమె చాలా మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలా  1989లో వచ్చిన మమతల కోవెల సినిమాలో రాశి ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. అందులో రాజశేఖర్ కూతురిగా ఆమె యాక్ట్ చేసింది. అప్పుడు రాశి వయసు కేవలం పదేళ్లు మాత్రమే. ఈ సినిమా వచ్చిన సరిగ్గా పదేళ్ల తర్వాత అంటే.. 1999లో రిలీజైన నేటి గాంధీ సినిమాలో అదే రాజ శేఖర్‌తో హీరోయిన్‌గా రొమాన్స్ చేసింది. అప్పుడు రాశికి 20 ఏళ్లు. అలా రాజశేఖర్‌కు కూతురి, అదే విధంగా హీరోయిన్‌గా నటించిన ఏకైక హీరోయిన్‌గా రాశి నిలిచింది.

ఇవి కూడా చదవండి

రాశి లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Zee Telugu (@zeetelugu)

కాగా రాజశేఖర్ లాగే రాశి కూడా ఇప్పుడు సహాయక నటిగా రాణిస్తోంది. ఇటీవల రిలీజైన పాపం ప్రతాప్ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆకట్టుకుంది రాశి . ప్రస్తుతం ఈ నటి చేతిలో పలు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకప్పటి హీరో సురేశ్ తో రాశి.. ఇంట్రెస్టింగ్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు