Ilaiyaraaja Biopic: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
భారతీయ సినిమా ఇండస్ట్రీకి ఇళయరాజా అందించిన సంగీత సేవలు మరువలేనివి. సుమారు7 వేలకు పైగా పాటలకు సంగీతం అందించారాయన. దాదాపు వెయ్యికి పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. అలాంటి దిగ్గజ సంగీత దర్శకుడి జీవిత విశేషాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి
ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయ రాజా జీవితంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ నుంచి కొత్త వార్త బయటకు వచ్చింది. విశేషమేమిటంటే ఇళయరాజా పాత్రలో ప్రముఖ కోలీవుడ్ నటుడు ధనుష్ నటించనున్నాడు . భారతీయ సినిమా ఇండస్ట్రీకి ఇళయరాజా అందించిన సంగీత సేవలు మరువలేనివి. సుమారు7 వేలకు పైగా పాటలకు సంగీతం అందించారాయన. దాదాపు వెయ్యికి పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. అలాంటి దిగ్గజ సంగీత దర్శకుడి జీవిత విశేషాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ‘ఇసైజ్ఞాని’ అనే టైటిల్‌ని పెట్టినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన వెంటనే ఇళయరాజా, ధనుష్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాపై అభిమానులు తమ ఉత్సాహాన్ని కామెంట్ల ద్వారా వ్యక్తం చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఇళయరాజా బయోపిక్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా 2025 మధ్యలో విడుదల కానుందని తెలుస్తోంది. ఇళయరాజా సినిమా కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఈ సినిమాలో వివరించనున్నారు. ఇళయరాజా పాత్రలో ధనుష్‌ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెర్క్యురీ మూవీస్, కనెక్ట్ మీడియా సంయుక్తంగా ఇళయరాజా బయోపిక్‌ను నిర్మించనున్నాయి. దర్శకత్వ బాధ్యతల కోసం వెట్రిమారన్‌ను సంప్రదించినట్లు సమాచారం.
కాగా ఇళయ రాజా సంగీత సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత నాటక అకడమిక్ అవార్డు వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంత చేసుకుకున్నారు. ఇక 50 ఏళ్లలో 20 వేలకు పైగా కచేరీలు పూర్తి చేసిన ఏకైక సంగీత విద్వాంసుడు ఇళయరాజా. రజనీ, కమల్, చిరంజీవి, మెహన్ బాబు, బాలకృష్ణ వంటి అగ్రహీరోలకు ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. గతంలో ఇళయరాజా బయోపిక్‌లో నటించేందుకు రజనీకాంత్ చర్చలు జరిపారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో హీరో ధనుష్ వచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో కెప్టెన్ మిల్లర్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. అలాగే డీ 50 మూవీని కూడా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాతే ఇళయరాజా బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.
Filming for the much-anticipated Official Biopic based on the life and times of the Music Maestro, Isaignani #ILAIYARAAJA with the very versatile and talented #Dhanush portraying the legendary composer on screen to commence on October 2024.
Film will… pic.twitter.com/9sS8n4NfVc
— Manobala Vijayabalan (@ManobalaV) November 10, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.