Thalaivar 170: ఇట్స్ అఫీషియల్.. రజనీకాంత్ సినిమాలో అమితాబ్.. 32 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తోన్న సూపర్ స్టార్స్
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్.. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఈ సూపర్ స్టార్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమితాబ్ బచ్చన్ హిందీ సినిమాల్లో మెరుస్తుంటే, దక్షిణాదిలో రజనీకాంత్ సందడి చేస్తున్నారు . ఇప్పుడు ఈ లెజెండరీ ఆర్టిస్టులు 'తలైవర్ 170' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. దీనికి సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్' నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్.. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఈ సూపర్ స్టార్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమితాబ్ బచ్చన్ హిందీ సినిమాల్లో మెరుస్తుంటే, దక్షిణాదిలో రజనీకాంత్ సందడి చేస్తున్నారు . ఇప్పుడు ఈ లెజెండరీ ఆర్టిస్టులు ‘తలైవర్ 170’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. దీనికి సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ‘తలైవర్ 170’ (వర్కింగ్ టైటిల్)తో తెరకెక్కుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్టులో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. కాగా రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన చివరి చిత్రం ‘హమ్’. 1991లో ఈ సినిమా విడుదలైంది. సుమారు 32 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల లాంగ్ గ్యాప్ లో వీరిద్దరూ ఒకే సినిమాలో నటించకపోవచ్చు. అయితే ఒకరికొకరు తమ సినిమాలకు మద్దతు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ అండగా నిలిచారు. రజనీకాంత్ నటించిన ‘రోబో’ సినిమా విలేకరుల సమావేశానికి అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు.
‘హమ్’ కంటే ముందు 1983లో విడుదలైన ‘అందా కానూన్’ సినిమాలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే 1985లో విడుదలైన ‘జిరఫ్తార్’ చిత్రంలో కలిసి నటించారు. ఇప్పుడు రజనీకాంత్ నటించిన తలైవర్ 170 చిత్ర బృందం అమితాబ్ బచ్చన్ స్వాగతం పలికింది. ఈ హై-వోల్టేజ్ కాంబినేషన్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే ‘జైలర్’ సినిమాతో రజనీకాంత్ భారీ విజయాన్ని అందుకున్నారు. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాదు గత కొన్నేళ్లుగా ప్లాఫ్‌లో ఉన్న తలైవాకు సూపర్ జోష్ ఇచ్చింది. ‘తలైవర్ 170’ సినిమాలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ మాత్రమే కాకుండా ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కూడా నటిస్తుండడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఈ చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. దీనికంటే ముందే లాల్ సలామ్ అనే ఓ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నారు రజనీకాంత్. విష్ణు విశాల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
View this post on Instagram
టాలీవుడ్ హల్క్ కూడా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.