Siddharth: సిద్ధార్థ్ సినిమాలెవరు చూస్తారన్నారు? స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరో
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం 'చిత్త'. ఇటీవల తమిళనాట విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఇటీవల తన సినిమా ప్రమోషన్ కోసం సిద్ధార్థ్ బెంగుళూరు వచ్చినప్పుడు కన్నడ అనుకూల సంస్థకు చెందిన కొందరు ఆయన విలేకరుల సమావేశాన్ని అడ్డుకున్నారు. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్, శివరాజ్ కుమార్ సిద్ధార్థ్‌కు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘చిత్త’. ఇటీవల తమిళనాట విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఇటీవల తన సినిమా ప్రమోషన్ కోసం సిద్ధార్థ్ బెంగుళూరు వచ్చినప్పుడు కన్నడ అనుకూల సంస్థకు చెందిన కొందరు ఆయన విలేకరుల సమావేశాన్ని అడ్డుకున్నారు. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్, శివరాజ్ కుమార్ సిద్ధార్థ్‌కు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. చిట్టా సినిమా ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ కానుంది. అక్టోబర్ 6న చిన్నా పేరుతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ గ్రాండ్‌గా జరిగింది. మూవీ యూనిట్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెంగళూరులో జరిగిన సంఘటనను మరోసారి గుర్తుకు తెచ్చుకుని ఎమోషనలయ్యాడు హీరో సిద్ధార్థ్ . ‘బెంగళూరులో జరిగిన ప్రెస్‌మీట్‌లో నువ్వు తమిళుడివి, గెటౌట్ అని అన్నారు. ఆ తరువాత కొందరు క్షమించమని అడిగారు, కృతజ్ఞతలు కూడా చెప్పారు. వారు ఎందుకు అలా అన్నారో నాకు తెలియదు. కానీ నిర్మాతగా, నటుడిగా సినిమా గురించి మాట్లాడనివ్వలేదు. ఇది నన్నెంతో బాధించింది’ అని చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్
‘తమిళంలో రెడ్ జాయింట్ సంస్థ మా సినిమా చూసి, ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడలేదని రైట్స్ కొన్నారు. మలయాళంలో కూడా గోకులం గోపాలన్ నా 55 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి సినిమా చూడలేదు అంటూ నా సినిమాను కొన్నారు. తెలుగులో ‘కేజీఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన టీమ్ నా చిత్రాన్ని కొనుగోలు చేసింది. అయితే తెలుగులో సిద్ధార్థ్ సినిమాను ఎవరు చూస్తారు అని అన్నారు’ అంటూ వేదికపైనే సిద్ధార్థ్ కంటతడి పెట్టుకున్నారు. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులే అందించారు. అలాగే నేను చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ సినిమా. ఇంతకంటే మంచి సినిమా తీయలేను. నేను మంచి సినిమా తీస్తే జనాలు చూస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నారు సిద్ధార్థ్. ‘ఈ చిత్రాన్ని తెలుగులో సెప్టెంబర్ 28న విడుదల చేయాలని భావించారు. అయితే సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారు అని కొందరు చెప్పడంతో నాకు థియేటర్లు సరిగా రాలేదు. అప్పుడు నేను మీతో ఉన్నానంటూ ఏషియన్ సినిమా సునీల్ నాతో నిలబడ్డారు. మీకు సినిమాలంటే ఇష్టమైతే, మంచి సినిమాలు చూడటం ఇష్టం ఉంటే ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసిన తర్వాత ‘తెలుగులో సిద్ధార్థ్ సినిమాలు చూడం’అని మీకు అనిపిస్తే, ఇక తెలుగులో ప్రెస్‌మీట్‌లు పెట్టను. ఇక్కడకు కూడా రాను’ అని ఎమోషనల్ గా చెప్పాడు సిద్ధార్థ్.
సిద్ధార్థ్ ఎమోషనల్
‘This is the best film in my 22 years of career’ – #Siddharth about #Chinna ❤️🔥❤️🔥
In cinemas from October 6th ✨
ICYM the #ChinnaTrailer 💥 – https://t.co/398f3EGACk#SUArunkumar #NimishaSajayan @Etaki_Official @Music_Santhosh @Composer_Vishal @balaji_dop137 @Etaki_Official… pic.twitter.com/Hh9R1EmDPe
— Shreyas Media (@shreyasgroup) October 3, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.