AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో మరో అందాల తార.. కీలక పాత్రలో ఆ స్టార్ హీరోయిన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా పై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో మరో అందాల తార.. కీలక పాత్రలో ఆ స్టార్ హీరోయిన్
Raaka
Rajeev Rayala
|

Updated on: Apr 09, 2026 | 3:41 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఏకంగా పుష్ప సినిమాలతో వెయ్యి కోట్ల మార్క్ దాటేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అట్లీ , అల్లు అర్జున్ సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాకు రాకా అనే టైటిల్ ను ఖరారు చేశారు.

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

ఇక ఈ సినిమాలో దీపికా పడుకోనే హీరోయిన్ గా నటిస్తుంది. దీపికా తోపాటు మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. అంతే కాదు ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆమె ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఆమె స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ.

ఇవి కూడా చదవండి

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు వరుసగా సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది ఈ అందాల తార. ఇక ఇప్పుడు రాకా సినిమాలో రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రమ్యకృష్ణ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దాంతో రాకా సినిమాలో రమ్యకృష్ణ ఫిక్స్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారా అని అభిమానులంతా చర్చించుకుంటున్నారు. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!